కల్తీమందు పై జగన్ హామీ.. బొత్స రియాక్షన్ ఏంటి?
posted on Dec 10, 2015 9:27AM
వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ వల్ల ఇప్పుడు ఆ పార్టీలోని ఒక వ్యక్తికి తలపట్టుకునే పరిస్థితి వచ్చిందట. అది ఏవరనుకుంటున్నారా..? ఇంకెవరూ బొత్స సత్యనారాయణ.. జగన్ హామీకి.. బొత్సకు సంబంధం ఏంటనుకుంటున్నారా.. అదేంటంటే.. విజయవాడ, కృష్ణలంకలో కల్తీ మందు తాగి చాలామంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆ కుటుంబాలను పరామర్శించడానికి వెళ్లిన జగన్.. దొరికిందే ఛాన్స్ కదా అని ఏపీ ప్రభుత్వం పై నాలుగు విమర్శల బాణాలు వదిలి.. ఆవేశంతో తాను అధికారంలోకి వస్తే కనుక మద్యం నిషేదిస్తామని పెద్ద హామీనే ఇచ్చారు. ఇప్పుడు జగన్ ఇచ్చిన హామీతో ఆపార్టీలోని బొత్సకు చిక్కులు వచ్చిపడ్డాయి. ఎందుకంటే బొత్సకు లిక్కర్ బిజినెస్ ఉంది కాబట్టి. జగన్ తను ఇచ్చిన హామి ముందు నెరవేర్చాలంటే.. అంతకంటే ముందు బొత్స చేత తన లిక్కర్ బిజినెస్ ను మూయించాలి. అసలే బొత్సకు ఉత్తరాంధ్రలో లిక్కర్ డాన్ అనే పేరు కూడా ఉంది. ఈ విషయంపై గతంలో ఒకరు ప్రశ్న అడిగినా దానికి బొత్స ఏ మాత్రం భయపడకుండా ఏం.. మేము ఈ వ్యాపారం చేయొద్దా అని ఎదురు ప్రశ్నించాడు. మరి అలాంటి బొత్స ఇప్పుడు జగన్ ఇచ్చిన హామికి ఎలా రియాక్ట్ అవుతారో అని అందరూ చర్చించుకుంటున్నారు.
మరోవైపు జగన్ ఇచ్చిన హామిపై విమర్శలు ఎదురవుతున్నాయి. ముందు తమ పార్టీలో ఉన్న నాయకులతో లిక్కర్ బిజినెస్ మూయించండి.. ఆతరువాత రాష్ట్రంలో నిషేదం చేయోచ్చు అని కౌంటర్లు ఇస్తున్నారు. మరి ఈవిషయంలో జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో.. జగన్ ఇచ్చిన హామికి బొత్స ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి.