హేమశ్రీ తల్లిని ప్రశ్నిస్తున్న బెంగళూరు పోలీసులు
posted on Oct 17, 2012 1:48PM

కన్నడ నటి హేమశ్రీ హత్య కేసు దర్యాప్తు వేగంగా సాగుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కేసుని అనంతపురం పోలీసులకు బదిలీ చేసే ప్రశ్నేలేదని అదనపు పోలీస్ కమిషనర్ సునీల్ కుమార్ స్పష్టం చేశారు. క్లోరో ఫామ్ ఎక్కువగా ఇచ్చినందువల్లే హేమశ్రీ మృతి చెందిందన్న నిజాన్ని ఆమె భర్త సురేంద్ర పోలీస్ ఇంటరాగేషన్ లో ఇప్పటికే బైటపెట్టేశాడు. సురేంద్ర ఇచ్చిన సమాచారంతో తీగలాగిన బెంగళూరు పోలీసులకు హత్య వెనక మాజీ కార్పొరేటర్ మురళి హస్తం కూడా ఉందన్న విషయం తెలిసిపోవడంతో కేసులో చిక్కుముడి వీడిపోయింది. కేసుకి సంబంధించిన మరిన్ని వివరాల్ని సేకరించేందుకు పోలీసులు హేమశ్రీ తల్లిని ప్రశ్నిస్తున్నారు. విలువైన సమాచారాన్ని సేకరించి పక్కా ఆధారాల్ని కనిపెట్టేందుకు గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు.