న్యూజిలాండ్ ప్రధానిగా రెండోసారి ఎన్నికైన జసిండా
posted on Oct 17, 2020 5:33PM
న్యూజిలాండ్ ప్రధానిగా జసిండా ఆర్డర్న్ రెండోసారి ఎన్నికయ్యారు. ఈ నెల 17న జరిగిన ఎన్నికల్లో ప్రస్తుతం న్యూజిలాండ్‌లో అధికారంలో ఉన్న జసిండా ఆర్డర్న్ నేతృత్వంలోని లేబర్ పార్టీ ఘన విజయం సాధించింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన జసిండా ఆర్డర్న్.. భారీ మెజార్టీతో గెలిపించినందకు ప్రజలకు కృతజ్జతలు తెలిపారు. తదుపరి మూడు సంవత్సరాల్లో చేయాల్సిన పని చాలా ఉందని, న్యూజిలాండ్ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. కరోనా ఏర్పరచిన ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని బయటకు తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు.
కాగా, కరోనా వైరస్‌ను సమర్థవంతంగా ఎదుర్కొన్న ప్రధానిగా జసిండా ఆర్డర్న్ కు ప్రజల్లో మంచి పేరుంది. అగ్రదేశాలు సైతం కరోనా దెబ్బకి అల్లాడిపొతే, జసిండా ఆర్డర్న్ సమర్థవంతంగా మహమ్మారిపై పోరాడి న్యూజిలాండ్ ని కరోనా ఫ్రీ కంట్రీగా చేసి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారు.