జగన్ బ్యాటింగ్ పై జబర్దస్ రీమిక్స్.. ఫుల్లుగా ఆడుకుంటున్నారు.. 

సెలెబ్రిటీస్ ఏ చిన్న పని చేసినా హైలెట్ అవడం కామనే. చిరంజీవి లాక్ డౌన్ లో వంట చేసినా.. హైలెటే.. ఇంకేం జరిగినా హైలెట్ అవుతుంది. ఎందుకంటే వారేం చేసినా.. అది చూపిస్తే జనం చూస్తారు. ఇది మీడియా ఫార్ములా. అందుకే అలాంటివి జరిగినప్పుడు తెగ చూపించేస్తారు. ఇది కూడా ఒక న్యూసేనా అంటూ తిట్టుకునేవాళ్లు కూడా దానిని రెండు మూడు సార్లు చూస్తారు. అది హ్యుమన్ సైకాలజీ.. అంతే మరి. అప్పట్లో చంద్రబాబునాయుడు నల్ల కళ్లద్దాలు పెట్టుకుని ఎయిర్ షో చూస్తే.. అది కూడా బాగా హైలెట్ అయింది. 

ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి క్రికెట్ ఆడితే.. అది మరీ హైలెట్ అయిపోయింది. మామూలు మీడియాలో ఆకాశానికెత్తేస్తే.. సోషల్ మీడియాలో కామెడీ చేసేస్తున్నారు. ఇప్పుడు ఆ వీడియో ట్రెండింగ్ అయిపోయింది. ఒక నెంబర్ వన్ చానెల్ లో అయితే ... మామూలుగా పొగడలేదు. వారికి జగన్ క్రికెట్ ఆడుతున్న దృశ్యం అద్భుత దృశ్యంగా కనిపించిందంట. చూడటానికి రెండు కళ్లు కూడా సరిపోలేదంట. అసలు రెండు బాల్స్ ఆడినందుకే జగన్ ను ఇంత ఎత్తేస్తే.. ఒక మ్యాచ్ ఆడుంటే ఇంకేం చేసేవారో. దాని గురించి ఒక ప్రోగ్రామ్ కాదు.. రెండు మూడు ప్రోగ్రామ్ లలో ఐదేసి నిముషాల పాటు తెగ చూపించేశారు.ఆయన కొట్టింది రెండు సార్లు అయితే..వీరు దాదాపు వంద బాల్స్ కొట్టించారు. నిజంగా అది జగన్మోహన్ రెడ్డి చూస్తే మాత్రం..ఆ స్క్రిప్టు రాసినోళ్లకి కూడా ఏదో ఒక పథకం అందేలా చేసేస్తాడు. నిజం ఆ రేంజ్ లో రాశారు మరి. జనానికి ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని..చూపించొచ్చు గాని..మరీ ఇంత ఓవర్ యాక్షన్ అవసరమా?

ఇక సోషల్ మీడియాలో అయితే రివర్స్ లో నడుస్తోంది. వైసీపీ మద్దతుదారులు అయితే జగన్ బ్యాటింగ్  చేస్తే అంతే మరి..బాల్ అయినా బాబు అయినా అంటూ సెటైర్లు వేశారు. ఇక కొందరు యూ ట్యూబర్స్ ఓ స్కూప్ లా తయారు చేసేశారు. 7జీ బృందావన కాలనీలో హీరో హీరోయిన్ చూస్తుందని బిల్డప్ ఇస్తూ క్రికెట్ ఆడిన సీన్ ని..జగన్ బ్యాటింగ్ వీడియోతో రీమిక్స్ చేసేసి పెట్టేశారు. అది ఫుల్ ట్రెండింగ్ అయిపోయి.. ఫుల్ కామెడీ చేసేస్తోంది. ఫేస్ బుక్ లో వైసీపీ మద్దతుదారులు పెట్టిన వీడియోకి.. కౌంటర్ గా ఈ వీడియోను కొందరు అదే వాల్ పై పోస్టు చేస్తున్నారు. దీంతో కామెంట్ల యుద్ధం నడుస్తోంది దీని మీద.