ఒక్కడిగా వచ్చాడు ఒక్కడిగా మిగిలిపోయాడు... నేడు వైఎస్ జగన్ బర్త్ డే
posted on Dec 20, 2024 6:15PM
అధికారమే పరమావధిగా రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చిన వైకాపా అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మ దినోత్సం డిసెంబర్ 21. ఆయనపై పలు కేసులు, అవినీతిపరుడంటూ ఆరోపణలు రావడంతో గత ఎన్నికల్లో ప్రజలు ఇంటికి పంపించి వేశారు. ఒక్కడిగా రాజకీయాలు ప్రారంభించిన జగన్ ఒక్కడిగానే మిగిలిపోయారు. . గెలిచిన ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహించిన ధీశాలి వైఎస్ జగన్. ప్రజా సంకల్ప యాత్రతో అకారణంగా జనంతో మమేకమైన నేతగా పేరు మూటగట్టుకున్నారు. యువభేరీ పేరుతో ప్రత్యేకహోదా నినాదాన్ని మోసిన జగన్ తనకు ముఖ్యమంత్రి హోదా రాగానే ప్రత్యేక హోదా నినాదాన్ని సజీవంగా సమాధి చేశారు. తనని తాను అవకాశ వాద నేతగా ఐడెంటిటీ ఇచ్చుకున్నారు. . వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్క చాన్స్ ఇవ్వండి అని 2019 ఎన్నికల్లో ప్రచారం చేసుకున్నారు. ఈ ఒక్క చాన్స్ చివరి చాన్స్ అవుతుందని ఆనాడు జగన్ మోహన్ ఊహించి ఉండరు. నవ్యాంధ్రలో రెండోసారి జరిగిన ఎన్నికల్లో(2019) గెలిచి వైకాపా కు విక్టరీని అందుకున్నప్పటికీ మూడో సారి జారవిడుచుకున్నారు. తన అధర్మ, అరాచకపాలను ఎపి ప్రజలు తగిన బుద్ది చెప్పారు. ప్రస్తుతం ఏపీలో ప్రతిపక్ష నేతగా కూడా ప్రజలు గుర్తించలేకపోతున్నారు. వైనాట్ 175 అనే జగన్ 11 సీట్లకే పరిమితమయ్యారు. రెండు సీట్లు పెరిగి డబుల్ డిజిట్ హోదా దక్కినందుకు జగన్ లోలోపల ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నారు. వైఎస్ జగన్ డిసెంబర్ 21 (శనివారం)తో 52 వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు.
పులివెందులలో రాజకీయ ఎంట్రీ ఇచ్చిన వైఎస్ జగన్మోహన్రెడ్డి.. 2004లో రాజకీయ అరంగేట్రం చేశారు. . తండ్రి చనిపోయిన సమయంలో పరామర్శించడానికి వచ్చిన నేతలకు ముఖ్యమంత్రి సీటు కట్టబెట్టాలని రికమెండ్ చేసుకున్న వారసుడు వైఎస్ జగన్. అప్పట్లో కాంగ్రెస్ తరఫున ప్రచారం చేశారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుని కడప పార్లమెంటు అభ్యర్థిగా గెలుపొందారు. కానీ వైఎస్ జగన్ టార్గెట్ ఎంపీ కాదు . ముఖ్యమంత్రి సీటు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసుడిగా కాంగ్రెస్ పార్టీలో ఇమేజ్ సృష్టించారు. . ఈ ఇమేజి తన రాజకీయ భవిష్యత్తుకు వాడుకున్న ఊసరవెల్లి వైఎస్ జగన్ . 2009లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి రెండోసారి అధికారం చేపట్టగానే హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఈ డెత్ మిస్టరీ ఇంకావీడలేదు. సిఎం కుర్చీ కోసం తండ్రిని చంపించినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డికి ముఖ్యమంత్రి పదవి దక్కడంలో ముఖ్యభూమిక వహించిన సోనియాగాంధీని ఎదిరించి మాతృసంస్థ కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్ బయటికొచ్చారు. కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగిన వైఎస్ జగన్ అధికార దాహంతోనే కాంగ్రెస్ పార్టీని వీడారు. తండ్రి మరణవార్తతో వైఎస్ అభిమానులు గుండెపగిలి చనిపోయారు. తన క్రిమినల్ బ్రెయిన్ ఉపయోగించి ఆ కుటుంబాలను పరామర్శించాలని స్కెచ్ వేశారు జగన్ . .ఓదార్పు యాత్ర ప్రారంభించారు.తండ్రిని అడ్డం పెట్టుకుని అక్రమాస్తులు సంపాదించిన ఆరోపణ మీద 16 నెలలు జైలు జీవితాన్ని గడిపారు. ఈ సమయంలో తల్లి, చెల్లి జగన్ కు బాసటగా ఉన్నారు. 2019లో ముఖ్యమంత్రికాగానే వారిని పక్కనపెట్టేసారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలకు ఫిరాయింపులు ప్రోత్సహించారు. 18 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి వైకాపాలో చేరారు.
ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సయయంలో వైకాపా సంక్షోభంలో చిక్కుకుంది. సమైక్యాంధ్ర నినాదాన్ని భుజానికెత్తుకోవడంతో తెలంగాణ ప్రజలకు దూరమయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన వైకాపా రెండు రాష్ట్రాల్లో పరాజయం చెందింది. ఎపిలో ఒక శాతానికి పడిపోయింది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ వ్యూహాలతో వైకాపా పూర్తిగా చిత్తయ్యింది మాజీ ముఖ్యమంత్రి అనే పేరు తప్ప జగన్ సాధించింది ఏమీ లేదు.అక్రమాస్తులు, అరాచకపాలన తప్ప.