అప్పు చేయ్.. తప్పు చేయ్.. జగనన్న సూపర్ స్కీమ్!
posted on Jul 10, 2021 2:14PM
కింగ్ ఫిషర్ విజయ్ మాల్యా తెలుసుగా. గురుడు మాంచి టేస్ట్ ఉన్నోడు. అసలు కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ స్టార్ట్ చేసినప్పడు.. ఆ కలర్స్..కలర్ ఫుల్ ఎయిర్ హోస్టెస్ లు... పెట్టే ఫుడ్ ..ఒకటేమిటీ అన్నీటెంప్టింగే. అప్పట్లోనే ప్రతి సీటుకు స్క్రీన్ పెట్టి టీవీ చూపించేశాడు మనోడు. ప్యాసింజర్స్ ఎగబడి మరీ ఆ ఫ్లయిట్స్ ఎక్కేవాళ్లు. అది చాలక.. నేను అది కొనేస్తా..ఇది కొనేస్తానని ఎగిరాడు. ఈలోపు ఉన్న ఫ్లైట్ కూలిపోయింది. ఎందుకంటే ఆ సోకులన్నీ అప్పులతోను.. ఒక పద్ధతి లేకుండా డబ్బులు వాడేసి..చివరకు లోన్లు తిరిగి కట్టాల్సిన టైమ్ దాటిపోవడంతో.. చేతికి సొమ్ము దొరక్క.. కుప్పకూలిపోయింది గురుడి సామ్రాజ్యం. ఇంత చేసినా ఆ సొమ్ముల్లోంచి తనకంటూ తీసుకోవడం మర్చిపోలేదండోయ్.. అవి పక్కన పెట్టాడు. వాటి కోసమే ఇప్పుడు బ్యాంకులన్నీ పాపం పోరాడుతున్నాయ్.
ఇదంతా ఎందుకంటే.. అప్పు చేసి పప్పు కూడు.. లోన్ తీసుకుని బిర్యానీ తినడం.. క్రెడిట్ కార్డుతో మందు పార్టీ..ఇవన్నీ అందరూ చూసేసినవే. కాకపోతే ఎప్పటికప్పుడు అప్ డేట్ గా కొత్తగా చూపిస్తుంటారు. ఇప్పుడు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అదే రూటులో వెళుతున్నారు. ప్రజలకు సంక్షేమం అందివ్వడం తన లక్ష్యమని.. చెబుతూ అనుకున్నది అనుకున్నట్లుగా రకరకాల పేర్లతో జనాలకు డబ్బులు వేయటం.. వారంతా ఇక తనతోనే ఉంటారని.. తనకు అధికారం శాశ్వతమని.. జైలుశిక్ష పడినాకూడా ఫరక్ పడనది జగన్ కాన్సెప్ట్. కాని అన్ని డబ్బులు కూడేయటం కష్టంకదా..అందుకే ఏ డబ్బులు పడితే ఆ డబ్బులు..లాగేసి..పాతవి, కేంద్ర పథకాలను సైతం ఆఫేసి.. ఆ డబ్బులన్నీ తాను కొత్తగా పేర్లు పెట్టిన సంక్షేమ పథకాలకు తరలించేశారు. అటు నుంచి డబ్బులు పంపుతూ..కష్టకాలంలో కూడా తాను అనుకున్నట్లు ఇస్తున్నానని చెప్పుకుంటున్నాడు.
పయ్యావుల కేశవ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్. ప్రతిపక్ష నేతకే ఈ పదవి ఇస్తారు. ఆయన లెక్కలన్నీ ఏదో తవ్వుదామని అనుకున్నాడు. కాని ఆయనకు ఆ కష్టం లేకుండానే కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) ఓ రిపోర్టు ఇచ్చింది. అది చదివితే.. ఆయనకు దిమ్మ తిరిగినట్లుంది. తాము అనుకున్నదాని కంటే ఘోరంగా పరిస్ధితి ఉందని అర్ధమైంది. ఒకటి కాదు రెండుకాదు..ఏకంగా 41వేల కోట్లకు లెక్కా పత్రం లేదని కాగ్ తేల్చింది. ఎస్సీఎస్టీ నిధులేమో అమ్మ ఒడికి పంపించేశారు. కార్పొరేషన్ల నిధులు చేయూత, కాపు నేస్తం లాంటి పథకాలకు లాగేశారు. అక్కడ అప్పటికే శాంక్షన్ అయినవాటికి మాత్రం అన్నీ ఆపేశారు. ఉపాధి హామీ పనులకు గతంలో చేసినవాటికి పేమెంట్ పెండింగ్ పెట్టేశారు... ఆ డబ్బులు కేంద్రం నుంచి వచ్చినా..వాటిని కొత్త పనులకు వాడేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం కళ్లు గప్పికూడా లోన్లు పరిధిని మించి తీసేసుకున్నారు. ఏ ప్రాపర్టీ పడితే ఆ ప్రాపర్టీ తాకట్టు పెడతాం డబ్బులివ్వమని బ్యాంకుల వెంట పడుతున్నారు. ఆఖరికి తాము వద్దనుకునే అమరావతి ప్రాజెక్టును సైతం పెండింగ్ పనుల పూర్తిగా లోను కావాలంటూ హడావుడి చేసి..ఆ లోను డబ్బులను వేరేదానికి వాడుకోవడానికి కూడా ప్లాన్ చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయని ప్రభుత్వం మీద విమర్శలు చేసేవారు అంటున్నారు.
మొత్తం మీద 41 వేల కోట్లకు లెక్కలు లేవని..ఈ డబ్బులన్నీ పోయాయని కాదని..అసలు ఇవి సక్రమంగా వాడారాలేదా అనేది తేల్చడానికి కూడా వీల్లేకుండా చేశారని పయ్యావుల కేశవ్ ఆరోపించారు. రాష్ట్ర ఆర్ధిక శాఖ మాత్రం అలాంటిదేమీ లేదని.. ఖండించింది. అంతే ఏ సలహాదారుడు, ఏ మంత్రి కూడా దీనిపై నోరు మెదపటం లేదు. అసలే కోవిడ్ సంక్షోభం.. దేశంలో ఆర్ధిక పరిస్ధితి కూడా బాగోలేదు. ఈ రెండేళ్లు ఇచ్చినట్లు ఇవ్వలేమని వారికి కూడా అర్ధమైంది. అందుకే లబ్ధిదారులను తగ్గించే పని కూడా రీసెంట్ గా మొదలెట్టారు. తర్వాత తర్వాత.. గ్యాస్ సబ్సిడీలాగా...స్వచ్చంధంగా పథకాల నుంచి తప్పుకునేవారు తప్పుకోవాలనే రిక్వెస్టులు కూడా రావొచ్చు