సైబరాబాద్ మొక్క.. తప్పిన లెక్క

రాజమహేంద్రవరం వేదికగా జరిగిన రెండు రోజుల పాటు జరిగిన మహానాడు ఆదివారంతో ముగిసింది.   మహానాడు వేదికగా తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఆరు అంశాలతో కూడిన మినీ మేనిఫెస్టోను ప్రకటించారు.  అయితే మహానాడులో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు, మేనిఫెస్టోపై ఆయన చేసిన ప్రకటనపై అధికార వైసీపీ మంత్రులు, మాజీ మంత్రులు తమదైన శైలిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికే గుడివాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని.. తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. అలాగే  వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజినీ కూడా విమర్శించారు. ఇప్పటికే కొడాలి నానిపై నెటిజన్లు ఫైర్ అవుతుంటే..  విడదల రజినీ విమర్శలపై  నెటిజన్లు ఓ రేంజ్ లో విరుచుకుపడుతున్నారు.  అంతేకాదు.. చంద్రబాబుపై ఆమె చేసిన ప్రతి కామెంట్‌కి  కౌంటర్ ఇస్తున్నారు.  

ఆ క్రమంలో ఏపీ సీఎం  జగన్‌ను తిట్టేందుకే ఈ మహానాడు ఏర్పాటు చేశారంటు విడదల రజినీ పేర్కొనడంపై.. ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు.  మరి జగన్ తొలి కేబినెట్‌లోని మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, అనిల్ కుమార్ తదితరులు చంద్రబాబుని బండ బూతులు తిట్టారని..  వారి సంగతి ఏమిటని వారు ఈ సందర్భంగా నిలదీస్తున్నారు. అలాగే ఇదే వేదికగా.. సైకిల్.. ఎలక్ట్రిక్ సైకిల్‌గా మారబోతోందని.. ఆ క్రమంలో ముందు చక్రం సంక్షేమం అయితే వెనుక చక్రం అభివృద్ధి అని చంద్రబాబు చెబుతున్నారని.. కానీ ఆయన ప్రభుత్వ హయాంలో సంక్షేమం గురించి కానీ.. అభివృద్ధి గురించి కానీ పట్టించుకోలేదని ఆమె విమర్శించడంపై  కూడా నెటిజన్లు రజని తెలుగుదేశం గూటిలో ఉన్న సమయంలో చేసిన కామెంట్లను గుర్తు చేస్తూ ఓ ఆటాడుకుంటున్నారు.  2017లో విశాఖపట్నంలో టీడీపీ నిర్వహించిన మహానాడు వేదికగా.... అదీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో... అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ నారా చంద్రబాబు నాయుడు గారని.. హైదరాబాద్‌లో సైబరాబాద్ నిర్మాణంలో చంద్రబాబు పాత్ర ఉందని.. ఆ సైబరాబాద్‌లో మీరు నాటిన ఈ మొక్క నేను సార్..  అంటూ నాడు ఒకటికి రెండు స్లారు గర్వంగా చెప్పుకొచ్చిన విషయం  మరిచిపోయారా? మంత్రి రజినీ అంటూ నెటిజన్లు.. సోషల్ మీడియా వేదికగా చురకలంటిస్తున్నారు.

అయితే ముఖ్యమంత్రి జగన్.. సంక్షేమాన్ని, అభివృద్ధి ఆయన రెండు కళ్లని.. వాటిని ఆయన ఏ విధంగా ముందుకు తీసుకు వెళ్తున్నారో.. అందరు చూస్తున్నారని మీరు చెబుతున్నారు. అసలు అభివృద్ధి , సంక్షేమ అంటే ఏమిటని నెటిజన్లు ఈ సందర్బంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని  సోషల్ మీడియా ద్వారా  సూటిగా ప్రశ్నిస్తున్నారు. 

చంద్రబాబు చేసింది చెప్పేందుకు ఏమీ లేక ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారని.. మీరు అంటున్నారు. మరి మీ పార్టీ అధినేత   జగన్ ప్రతిపక్ష నేతగా.. ఇచ్చిన హామీలు.. ఆ తర్వాత ఆయన గద్దెనెక్కిన అనంతరం అమలు చేసిన వాటి గురించి మీరు కనీసం ఒకటి లేకుంటే రెండు వివరించగలరా? అని ఈ సందర్బంగా  డిమాండ్ చేస్తున్నారు. అలాగే సంపద సృష్టి, మేనిఫెస్టోలపై చంద్రబాబు వ్యాఖ్యలపై ఆమె తీవ్ర విమర్శలు గుప్పించడాన్ని ఖండించి.. వాటికి సైతం నెటిజన్లు తమదైన శైలిలో ఆమెకు కౌంటర్‌ ఇస్తున్నారు.

ఇక 2019 ఎన్నికల్లో చిలకలూరిపేట నుంచి టీడీపీ ఎమ్మెల్యే టికెట్ ఆశించడం.. అది కుదరదని టీడీపీ అధిష్టానం స్పష్టం చేయడంతో.. అప్పటికప్పుడు జంప్ జిలానీ రాగం ఆలపించి.. ఫ్యాన్ పార్టీలో చేరి.. అలా ఆ పార్టీ ఎమ్మెల్యే టికెట్ దక్కించుకొని.. తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టడమే కాదు....  మంత్రి పదవి కూడా చేపట్టి.. ఇప్పుడు.. మీ రాజకీయ జీవితానికి బేస్ అయిన టీడీపీపైనా, ఆ పార్టీ అధినేత చంద్రబాబుపై విమర్శలుగుప్పించడం ఏం మాత్రం పద్దతి కాదని నెటిజన్లు నిర్మొహమాటంగా మంత్రి రజనీకి తేల్చి చెబుతున్నారు. ఏదీ ఏమైనా.. సైబరాబాద్ మొక్క లెక్క తప్పిందంటూ సోషల్ మీడియాలో నెటిజనల్ కామెంట్స్  చేస్తున్నారు.