నీట్ యూజీ కౌన్సిలింగ్ వాయిదా!

వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ (neet) యూజీ పరీక్షలో అక్రమాల వ్యవహారం  తీవ్ర దుమారం రేపిన నేపథ్యంలో నీట్ యూజీ కౌన్సిలింగ్‌ను వాయిదా వేశారు. తదుపరి నోటీసులు ఇచ్చేంత వరకు కౌన్సిలింగ్ వాయిదా వేస్తున్నట్టు అధికార వర్గాలు ప్రకటించాయి. నీట్‌లో  ర్యాంకులు సాధించిన విద్యార్థులు ప్రవేశాల కోసం ఎదురు చూస్తున్న సమయంలో నిజంగా ఇది ఒక షాకింగ్ న్యూస్!