పవన్ నిర్ణయం నేడే..

 

నంద్యాల ఉపఎన్నికపోరు అధికార పార్టీ టీడీపీకి.. ప్రతిపక్ష పార్టీ వైసీపీకి పెద్ద అగ్నిపరీక్షగానే మారింది. ఈ ఉపఎన్నిక విజయమై 2019 ఎన్నికల విజయానికి తొలిమెట్టు అన్నట్టు భావిస్తున్నాయి రెండు పార్టీలు. అందుకే ఎక్కడా తగ్గకుండా రెండు పార్టీలు ప్రచార కార్యక్రమాల్లో జోరుగా పాల్గొంటున్నాయి.  వైసీపీ పార్టీ నుండి జగనే వేరే వాళ్లతో పని లేకుండా ప్రచారంలో పాల్గొంటూ.. టీడీపీపై తెగ కామెంట్లు విసురుతున్నారు. ఇక టీడీపీ కూడా జగన్ ధీటుగానే సమాధానమిస్తుంది. అంతేకాదు ఈ ప్రచారకార్యక్రమానికి టీడీపీ  బాలకృష్ణను ఇప్పటికే రంగంలోకి దింపింది. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కూడా రంగంలోకి దించాలని చూస్తుంది. ఇప్పటికే ఈ ప్రతిపాదన పవన్ కళ్యాణ్ ముందు ఉంచగా.. దీనిపై పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ ప్రశ్నకు నేటితో  సమాధానం దొరుకుతుందని పలువురు అంటున్నారు. ఉప ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతివ్వాలన్నవిషయమై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నేడు నిర్ణయం తీసుకోనున్నారట. ఈ విషయమై ఈరోజు పవన్ నుంచి స్పష్టమైన ప్రకటన వస్తుందని సమాచారం. మరి చూద్దాం పవన్ ఏం నిర్ణయం తీసుకుంటారో... ?