నేటి మధ్యాహ్నం ఫాం హౌస్ లో జానకీరామ్ అంత్యక్రియలు

 

రోడ్డు ప్రమాదంలో మరణించిన నందమూరి హరికృష్ణ తనయుడు జానకిరామ్ పోస్ట్ మారటం నివేదికను ఒస్మానియా వైద్యులు వెల్లడించారు.ఆయనకీ తల, చాతి, కుడి చెయ్యి మరియు కడుపులోపల తీవ్ర గాయలవడంతో మరణించారని తెలిపారు. సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హరికృష్ణ నివాసంలో ఉంచిన ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పించేందుకు తరలివస్తున్నారు. చెట్టంత కొడుకును పోగొట్టుకొన్న హరికృష్ణను ఓదార్చడం కష్టమవుతోంది. నిన్న మధ్యాహ్నం వరకు తమతో కబుర్లు చెప్పిన జానకీరామ్ మరిక లేడనే నిజాన్ని అయన కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేక విలపిస్తున్నారు. ఆయన అంత్యక్రియలు ఈరోజు మధ్యాహ్నం మొయినాబాద్ లోగల ఆయన ఫాం హౌస్ లో జరుగుతాయి.