ప్రకాశ్ రాజ్ కు కౌంటర్ గా  బండ్ల గణేష్  ఆసక్తకర ట్వీట్ 

హిందీ భాషను తమపై రుద్దకండి అంటూ చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదని  నటుడు ప్రకాశ్ రాజ్ తాజాగా జనసేనాని పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ట్వీట్ చేశారు. దీనికి కౌంటర్ గా  సినీ నిర్మాత, న‌టుడు బండ్ల గ‌ణేశ్ ట్విట్ట‌ర్‌ వేదిక‌గా ఓ ఆస‌క్తిక‌ర ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ చూసిన జనాలు ఇది ఖచ్చితంగా ప్రకాశ్ రాజ్ కు కౌంటర్ ట్వీట్ అని తెలుస్తోంది. 
 మూవీఆర్టిస్ట్ అసోసియేషన్ ( మూవీ) ఎన్నికల్లో  మా అధ్యక్ష  పదవికి పోటీ పడిన ప్రకాశ్ రాజ్ కు అప్పట్లో జనసేనాని పవన్ కళ్యాణ్ మద్దత్తు పలికారు. తాజాగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ ట్విట్టర్ లో రియాక్ట్ కావడాన్ని పవన్ కళ్యాణ్ వీరాభి మాని అయిన బండ్ల గణేష్ స్పందించారు. 
“కృతజ్ఞత లేకుండా బతకడం మానవత్వాన్ని కోల్పోవడమే, ద్రోహంతో బతకడం మనుష్యత్వాన్ని నాశనం చేసుకోవడమే. ఒక మనిషి జీవితంలో కృతజ్ఞత ఎంత ముఖ్యమో, ద్రోహం ఎంత ప్రమాదకరమో స్పష్టంగా తెలియజేస్తుంది. మనం ఎప్పుడూ కృతజ్ఞతతో జీవించాలి..!” అని ఆయ‌న ట్వీట్ చేశారు.  మా అధ్యక్ష పదవికి మంచువిష్ణుకు పోటీగా ప్రకాశ్ రాజ్ నిల్చున్నారు. అప్పట్లో జనసేనాని ప్రకాష్ రాజ్ వెంటే నిలిచారు. . పాత విషయాలను నెమరువేసుకున్న బండ్ల గణేష్ ట్వీట్ పొలిటికల్ గా హీటెక్కించింది.పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ చిత్రానికి బండ్ల గణేష్ నిర్మాత