సీటు బెల్ట్ పెట్టుకొని ఉంటే ప్రమాదం తప్పేదేమో?

 

నందమూరి హరికృష్ణ నివాసంలో ఉంచబడిన ఆయన కుమారుడు జానకీరామ్ భౌతికకాయానికి ఈ ఉదయం నివాళులు అర్పించడానికి వచ్చిన యంపీ చిరంజీవి, హరికృష్ణను కలిసి ఓదార్చే ప్రయత్నం చేసారు. కానీ ఆయన దుఖం చూడలేక చిరంజీవి కూడా కళ్ళ నీళ్ళు పెట్టుకొన్నారు. చనిపోయిన జానకీరామ్ ఆత్మకు శాంతి కలగాలని తను కోరుకొంటున్నాని అన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కారు డ్రైవ్ చేస్తున్నప్పుడు ప్రతీ ఒక్కరు సీటు బెల్ట్ ధరిస్తే ఇటువంటి ప్రమాదాలను కొంతలో కొంత నివారించే అవకాశం ఉంటుందని అన్నారు.