రేపు సాయంత్రం జానకీరామ్ అంత్యక్రియలు

 

నల్గొండ జిల్లా ఆకుపాముల దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నందమూరి హరికృష్ణ పెద్ద కుమారుడు నందమూరి జానకిరామ్ మృత దేహాన్ని కొద్ది సేపటి క్రితం పోస్ట్ మార్టం కోసం హైదరాబాద్ లో ఉస్మానియా ఆసుపత్రికి తీసుకువచ్చారు. మరికొద్ది సేపటిలో పోస్ట్ మార్టం పూర్తయిన వెంటనే శవాన్ని హరికృష్ణ కుటుంబానికి అప్పగిస్తారు. ఈ వార్త తెలిసినప్పటి నుండి వివిధ పార్టీల నేతలు, సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు మాసాబ్ ట్యాంక్ వద్దగల హరికృష్ణ నివాసానికి చేరుకొంటున్నారు. ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్, మంత్రులు, బంధువులు కూడా హరికృష్ణ ఇంటికి చేరుకొన్నారు. రేపు సాయంత్రం హైదరాబాద్ లో జానకిరామ్ అంత్యక్రియలు జరుగుతాయి.