కాకినాడలో దారుణం... పిల్లల తలలను బకెట్లో ముంచి చంపిన తండ్రి
posted on Mar 15, 2025 12:18PM
పోటీ పరీక్షలకు రాణించలేకపోతున్నారని తన ఇద్దరు పిల్లల కాళ్లు, చేతులను కట్టేసిన ఓ తండ్రి తలలను బకెట్లో ముంచి చంపేసాడు. తర్వాత తానూ ఊరివేసుకుని చనిపోయాడు. కాకినాడ జిల్లా వాకల పూడిలో అసిస్టెంట్ అకౌంట్ గా పని చేస్తున్న వానపల్లి చంద్రకిషోర్ ఒకటో తరగతి చదువుతున్న జోషిల్ , యుకేజీ చదువుతున్న నిఖిల్ పోటీ పరీక్షలకు రాణించలేకపోతున్నారని మనస్థాపం చెంది ఈ దారుణానికి పాల్పడ్డాడు. భార్య తనూజతో ఓ ప్లాట్ లో ఉంటున్న చంద్ర కిషోర్ తన పిల్లలను ఉన్నత స్కూళ్ళలో పోటీ పరీక్షలు రాయించాడు. పిల్లలిద్దరూ రాణించలేకపోవడంతో మనస్థాపం చెంది భార్య ఇంట్లో లేని సమయంలో పిల్లలిద్దరి కాళ్లు చేతులు తాళ్లతో కట్టేసి తలలను బకెట్లో ముంచి చంపేశాడు.. ఆతర్వాత తాను ఆత్మహత్య చేసుకున్నాడు. పిల్లల ప్రాణాలు కాపాడాల్సిన ఆ తండ్రే దారుణంగా చంపేయడం సంచలనమైంది.