కేసీఆర్ ఇచ్చిన మాటను తప్పాడు.. నాగం

బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నాగం జనార్ధన రెడ్డి సీఎం కేసీఆర్ ను విమర్శించారు. మహబూబ్ నగర్ జిల్లా నెట్టంపాడు ఎత్తిపోతల పథకం పనులు పరిశీలించడానికి వెళ్లిన ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ ఇచ్చిన మాటను తప్పారని.. కుర్చీవేసుకొని పనులు చూస్తానని చెప్పిన ఆయన ఇప్పుడు అవేమి పట్టించుకోవట్లేదని.. ప్రాజెక్టు పనులు జాప్యం అవుతున్నాయని ఎద్దేవ చేశారు. జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల పోరాటానికైనా సిద్ధమని నాగం అన్నారు.