గాలిలో తిరుగుళ్ళు.. గాలి మాటలు...

 

పదునైన మాటలతో తన రాజకీయ ప్రత్యర్థులను గుక్క తిప్పుకోనివ్వకుండా చేసే భారతీయ జనతా పార్టీ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి. ఆయన ఇప్పుడు తన వాగ్బాణాలను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మీద సంధించారు. ‘‘కేసీఆర్ గాలిలో తిరుగుతూ గాలి మాటలు చెబుతూ ప్రజలను ఊహల్లో విహరింపజేస్తున్నారు. కేసీఆర్ తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలు ఒకవైపు రైతులకు, మరోవైపు ప్రజలకు శాపాలుగా మారుతున్నాయి. తెలంగాణలో విపరీతమైన కరవు వుంటే దాని గురించి ముఖ్యమంత్రి ఎంతమాత్రం పట్టించుకోవడం లేదు. ఇంతవరకూ కరవు మండలాలను కూడా ప్రకటించలేదంటే ముఖ్యమంత్రిని ఏమనాలి?’’ అని నాగం ప్రశ్నించారు.