ఎయిర్ ఏషియా విమానం ఆచూకీ లభ్యం?
posted on Dec 29, 2014 1:48PM
ఇండోనేసియా సురబయ నుంచి సింగపూర్ వెళ్తూ కనిపించకుండా పోయిన ఎయిర్ ఏషియా విమానం ఆచూకీ దొరికినట్టు అక్కడి మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఆ విమానానికి సంబంధించిన శకలాలు జావా సముద్రంలో గుర్తించినట్లు తెలుస్తోంది. విమానంలోని మొత్తం 162 మంది మరణించారని ఆ కథనాలు పేర్కొన్నాయి. 155 మంది ప్రయాణికులు, ఏడుగురు విమాన సిబ్బంది వున్న ఎయిర్ ఏషియా విమానం - క్యూజెడ్ 8501 ఆదివారం ఉదయం ఇండోనేసియాలోని సురబయ నుంచి సింగపూర్ బయలుదేరింది. ఆ తర్వాత ఆ కొద్ది సేపటికే ఇండోనేసియా విమానాశ్రయంలోని ఏసీటీ కేంద్రం నుంచి విమానానికి సంబంధాలు తెగిపోయాయి. విమానం ఆచూకీ గల్లంతయి 24 గంటలు గడచినప్పటికీ ఆచూకీ దొరకకపోవడంతో ప్రయాణికుల బంధువులు రోదిస్తున్నారు. విమానం ఆచూకీ కోసం నాలుగు దేశాలకు చెందిన బృందాలు సముద్రంలో, గగనమార్గం ద్వారా అన్వేషణ జరుపుతున్నాయి. అయితే మీడియాలో విమానం శిథిలాలు దొరికినట్టు కథనాలు వస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని ప్రభుత్వం ఇంతవరకు అధికారికంగా ప్రకటించలేదు.