శ్రియను వాళ్ళు ఆదుకున్నారు...!

 

ఒకప్పుడు టాలీవుడ్ టాప్ హీరోలందరి సరసన నటించిన హీరోయిన్ శ్రియకు ప్రస్తుతం తెలుగులో అవకాశాలు రావడమే మానేసాయి. ఇపుడు తెలుగులో అక్కినేని ఫ్యామిలీ కలిసి నటిస్తున్న "మనం" చిత్రంలో నాగార్జున సరసన నటిస్తుంది. అయితే తెలుగులో అవకాశాలేమి రాకపోవడంతో వేరే భాషలపై దృష్టి పెట్టింది. ప్రస్తుతం ఈ అమ్మడు బాలీవుడ్ లో "వాల్మీకీ కీ బందూక్" అనే చిత్రంలో నటించే అవకాశం దక్కించుకుంది. అదే విధంగా మలయాళంలో "ప్రకాశం పారత్తున పెన్ కుట్టి" అనే సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఇందులో శ్రియతో‌పాటు ఆండ్రియా కూడా నటించనుంది. మరి ఈ చిత్రంతో అయిన శ్రియకు మరిన్ని సినీ అవకాశాలు వస్తాయో లేదో చూడాలి.