కాంగ్రెస్ పార్టీకి రేణుకాచౌదరి రాజీనామా..!!

 

టీఆర్‌ఎస్ కుటుంబపార్టీ అని విమర్శించిన టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. తన భార్యకు టికెట్‌ ఎందుకు తెచ్చుకున్నారని టీఆర్ఎస్ ఎంపీ కవిత ప్రశ్నించారు.కోదాడలో కవిత మీడియాతో మాట్లాడారు.ఉత్తమ్‌ కు నైతిక విలువలుంటే టికెట్‌ ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.కుటుంబ పాలన టీఆర్ఎస్ ది కాదని,కాంగ్రెస్‌దేనని కవిత విమర్శించారు. కాంగ్రెస్‌ నేతలు కుటుంబసభ్యులకే సీట్లు పంచుకున్నారని ఆరోపించారు.కూకట్ పల్లి నుంచి నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని పోటీ చేయటంపై కూడా కవిత స్పందించారు.కూకట్‌పల్లిలో సుహాసిని పోటీ చేసినా ప్రభావం ఏమీ ఉండదని స్పష్టం చేశారు.తెలంగాణలో టీడీపీ ని ఎవరూ ఆదరించట్లేదని అలాంటప్పుడు అభ్యర్థి ఎవరు ఉన్నా లాభమేంటని ప్రశ్నించారు.
కమ్మ వర్గానికి అన్యాయం జరిగిందంటూ కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకాచౌదరి నిరసన తెలుపుతూ పార్టీకి రాజీనామా చేస్తారని విన్నానని కవిత అన్నారు.చంద్రబాబు, రాహుల్‌గాంధీ ఒకే వేదికపైకి వచ్చి ప్రచారం చేస్తే చూడాలని ఉందని కవిత అన్నారు. ప్రచారానికి వెళ్తే ప్రజలంతా తెరాస నేతలపై ఆప్యాయత చూపుతున్నారని,కాంగ్రెస్‌ పేరే ఎత్తడం లేదని చెప్పారు. టీఆర్ఎస్‌కు వందకు పైగా స్థానాలు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదన్నారు. జగిత్యాల సీటు గెలిచి కేసీఆర్‌కు గిఫ్ట్‌గా ఇస్తామని ఆమె అన్నారు.నల్గొండలో మళ్లీ ఆరు స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.