మోమో, స్పింగ్ రోల్స్ ఫ్యాక్టరీలో కుక్కతల
posted on Mar 19, 2025 4:59PM
ఇండియాలో ఇష్ట పడే స్ట్రీట్ ఫుడ్ లలో మోమో, స్పింగ్ రోల్స్ ఎక్కువ సేలవుతుంటాయి. పంజాబ్ లో వీటిని తయారుచేసే ఫ్యాక్టరీలపై అధికారులు దాడులు చేయగా కళ్లు బైర్లు కమ్మే విషయాలు వెలుగు చూసాయి. ఈ ఫ్యాక్టరీలో బొద్దింకలు, ఎలుకలు, బల్లులు మాత్రమే కాదు డీ ఫ్రిజ్ లో కుక్క తల కాయ కనిపించింది. మోమో, స్పింగ్ రోల్స్ లో కుక్క తలకాయ వినియోగిస్తారా అని అధికారులకు డౌటిచ్చింది. వెంటనే పరీక్షలకు పంపారు. కుక్క తలతో బాటు కుళ్లిన చికెన్, మటన్ కూడా కనిపించడంతో పంజాబ్ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. కూరగాయల్లో కూడా ఫంగస్ చేరింది. పూర్తిగా అపరిశుభ్ర వాతావారణంలో ఉన్న ఫ్యాక్టరీలో కుక్క తలను కార్మికులు తినడానికి భద్ర పరచుకున్నారా? మోమో, స్పింగ్ రోల్స్ లో కలపడానికా అనేది తేలాల్సి ఉంది. సదరు ఫ్యాక్టరీల నుంచి టన్నుల కొద్దీ ఫుడ్ సరఫరా అయినప్పటికీ అధికారులకు చీమ కుట్టినట్టు కూడా లేకుండా పోయింది.