మిస్డ్ కాల్ ప్రాణం తీసింది
posted on Jan 23, 2015 11:07PM

జస్ట్ ఒక మిస్డ్ కాల్ ఒక నిండు ప్రాణాన్ని తీసేసింది. ఆదిలాబాద్ జిల్లా వేమనపల్లి మండలం జక్కెపల్లి గ్రామానికి చెందిన నందన అనే పాతికేళ్ళ యువకుడు తన ఇంటి దగ్గర్లోనే ఉండే ఒక యువతికి మిస్డ్ కాల్ ఇచ్చాడు. ఆ యువకుడు మిస్డ్ కాల్ ఇచ్చిన యువతి ‘మిస్’ కాదు. మరొకరికి మిసెస్. నందన ఇచ్చిన మిస్డ్ కాల్‌కి స్పందించిన ఆ యువతి అతనికి తిరిగి ఫోన్ చేసింది. అలా ఇద్దరి మధ్య మాటలు పెరిగి సాన్నిహిత్యం ఏర్పడింది. అయితే ఈ వ్యవహారం ఆ యువతి భర్త దృష్టికి వచ్చింది. దాంతో ఆ యువతి భర్త నందనని పిలిచి ఈ వ్యవహారం నిలిపివేయాలని వార్నింగ్ ఇచ్చాడు. మీరు ఫోన్‌లో మాట్లాడిన మాటలన్నీ తాను రికార్డ్ చేశానని, వాటిని పోలీసులకు ఇచ్చి కేసు పెడతానని బెదిరించాడు. దాంతో అవమానంగా భావించడంతోపాటు భయపడిన నందన గ్రామం సమీపంలోని అడవిలోకి వెళ్ళి ఆత్మహత్య చేసుకున్నాడు.