కోర్టులో మానవబాంబు పేలుడు

 

బీహార్‌లోని ఆరా పట్టణంలో కోర్టు ఆవరణలో శుక్రవారం బాంబు పేలుడు జరిగింది. ఈ బాంబు పేలుడులో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. కొందరు న్యాయవాదులు సహా మొత్తం 16 మంది గాయపడ్డారు. మృతుల్లో ఓ మహిళతోపాటు కానిస్టేబుల్ ఉన్నాడు. బాంబు పేలుడులో మరణించిన మహిళే మానవబాంబుగా మారి పేల్చేసుకుందని పోలీసులు అనుమానిస్తున్నారు. తనకు సంబంధించిన ఖైదీలు పారిపోవడానికి అవకాశం కల్పిస్తూ ఆ మహిళ ఈ ఘాతుకానికి ఒడిగట్టి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. విచారణ ఖైదీలను పోలీసు వ్యాన్లో నుంచి కోర్టులోకి తీసుకువెళుతుండగా ఈ పేలుడు జరిగింది. పేలుడు హడావుడిలో ఇద్దరు ఖైదీలు తప్పించుకున్నారు. ఈ ఖైదీలలో ఒకడైన లంబూ శర్మ 2009లో ఇదే తరహాలో తప్పించుకున్న చరిత్ర వుంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu