హైదరాబాద్‌లో భూకంపం

 

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి భూమి స్వల్పంగా కంపించింది. హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్, అత్తాపూర్, చాంద్రాయణగుట్ట, పహాడీ షరీఫ్ తదితర ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది. దాంతో ప్రజలు భయాందోళనలతో ఇళ్ళలోంచి బయటకి వచ్చారు. భూ ప్రకంపనలు తగ్గినప్పటికి మళ్ళీ ఇళ్ళలోకి వెళ్ళడానికి భయపడుతూ చాలామంది బయటే ఉండి పోయారు. భూకంపం ఏ స్థాయిలో వచ్చిందో తెలియజేసే రిక్టర్ స్కేలు నమోదు వివరాలు ఇంకా తెలియరాలేదు. భూ ప్రకంపనల కారణంగా ఎలాంటి ఆస్తినష్టం సంభవించినట్టుగానీ, ఎవరైనా గాయపడినట్టుగానీ సమాచారం లేదు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu