మంచు లక్ష్మీని టీ వాదులు అంగీకరిస్తారా?

 

ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో హాట్ టాపిక్ ఏంటంటే తెలంగాణ తెలంగాణ రాష్ట్ర స్వచ్ఛభారత్ బ్రాండ్ అంబాసిడర్ గా మంచు లక్ష్మిని నియమించడం. ఎందుంటే అసలు ఉమ్మడిగా ఉన్న రాష్ట్రం ఒక రకంగా విడిపోవడానికి కారణం ఈ పదవులే కారణమని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదటి నుండి తెలంగాణ ఈ విషయంలో అసంత్పప్తిగానే ఉండేది. అందుకే అది కాస్త చిలికి చిలికి రాష్ట్ర విభజన వరకూ వచ్చింది.
 

అయితే ఇప్పుడు తాజాగా కేంద్ర తెలంగాణ స్వచ్ఛ భారత్ బ్రాండ్ అంబాసిడర్ గా మంచు లక్ష్మీని ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన అధికార బాధ్యతల్ని రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ నెల 10న బాధ్యతులు తీసుకోనున్నారు. మరి ఇప్పుడు ఆంధ్రా మూలాలున్న మంచు లక్ష్మీని తెలంగాణ వాదులు అంగీకరిస్తారా? లేదా? అని ఆసక్తి నెలకొంది.
 

ఒకవైపు కేంద్రంతో తెలంగాణ ప్రభుత్వం గత కొంత కాలంగా అంటీ ముట్టనట్టుగానే వ్యవహరిస్తుంది. మరి ఈసమయంలో తెలంగాణ స్వచ్ఛ భారత్ బ్రాండ్ అంబాసిడర్ గా మంచు లక్ష్మీని కేంద్రం నియమిస్తూ నిర్ణయం తీసుకోవడం వల్ల తెలంగాణ ప్రభుత్వం అసంతృప్తికి గురయ్యే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మరోవైపు కేసీఆర్ కుమార్తె కవితకు.. మంచు లక్ష్మీ సన్నిహితురాలు కావడంతో ఈవిషయంపై ఎలాంటి అభ్యంతరాలు ఉండవనే వాదన కూడా వినిపిస్తుంది. మరి తెలంగాణ వాదులు లక్ష్మీని అంగీకరిస్తారో లేదో చూడాలి.