సిఎం హోదాలో తొలిసారి రాజన్నను దర్శించుకున్న రేవంత్ రెడ్డి

రాజన్న సిరి సిల్లా జిల్లాలోని వేముల వాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయస్వామి అభివృద్దిపై  రేవంత్ సర్కార్ ప్రత్యేక దృష్టి పెట్టింది.  గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో పిపిసి అధ్యక్షుడి హోదాలో రాజన్నను రేవంత్ రెడ్డిదర్శించుకున్నారు.  తెలంగాణలో 10 ఏళ్ల తర్వాత అధికారంలో వచ్చిన కాంగ్రెస్ బడ్జెట్ లో 50 కోట్ల నిధులను కేటాయించింది. ఆలయ విస్తరణకు 127 కోట్లు మంజూరు చేస్తూ జీవో జారీ చేసింది.  సిఎం హోదాలో రేవంత్ రెడ్డి తొలిసారి పర్యటించారు.  గురువారం( నవంబర్ 20)వేములకు చేరుకున్నారు.  స్వామి వారికి కోడె మొక్కులు చెల్లించారు. అనంతరం రాజరాజేశ్వరి స్వామికి మొక్కులు చెల్లించి పూజలో పాల్గొన్నారు.  నంది దర్శనం చేసుకున్నారు. రాజరాజేశ్వరి ఆలయ ఆవరణలో ధర్మగుండం వద్ద 76 కోట్లతో  చేపట్టే ఆలయ అభివృద్ది పనులకు సిఎం శంఖుస్థాపన చేశారు