మాల్దీవ్స్ ప్రెసిడెంట్ మూఢ నమ్మకాలు మండ!

మూఢ నమ్మకాలు అనేవి మన ఇండియాలో మాత్రమే కాదు.. ప్రపంచమంతా వుంటాయ్. మూఢ నమ్మకాలు కేవలం చదువుకోని వాళ్ళకే వుంటాయి అనుకోనక్కర్లేదు.. ఎంత చదువుకున్న వాళ్ళలో అయినా ఇవి ఏడుస్తాయ్.. ఎవరిదాకో ఎందుకూ.. మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జుకి కూడా బుర్రనిండా మూఢ నమ్మకాలే వున్నాయ్.  షమ్నాజ్ సలీం అనే ఆవిడ, ఆదం రమీజ్ అనే పెద్దాయన తన మీద చేతబడి చేశారని ప్రెసిడెంట్ ముయిజ్జుకి డౌటొచ్చిందంట. అంతే, వెంటనే వాళ్ళిద్దర్నీ అరెస్టు చేయండని ఆర్డర్ వేసేశాడు. రాజుగారు తలచుకుంటే దెబ్బలకి కొదువా.. ప్రెసిడెంట్ ఇలా ఆర్డర్ వేశాడో లేదో పోలీసులు ఆ ఇద్దర్నీ అరెస్టు చేసి లోపలేశారు. అరెస్టు అయిన వీళ్ళిద్దరూ ఏ శ్మశానంలోనో చేతబడులు చేసుకుని బతికేవారు కాదు.. సాక్షాత్తూ మాల్దీవ్స్ దేశంలో మినిస్టర్లుగా వర్క్ చేస్తున్న పెద్దమనుషులే. మేమేంటి.. చేతబడి చేయించడమేంటి మొర్రో అని ఆ ఇద్దరు మినిస్టర్లూ ఎంత మొత్తుకున్నా పోలీసులు ఎంతమాత్రం పట్టించుకోకుండా ఇద్దర్నీ జైల్లో పారేశారు. పనిలోపనిగా వీళ్ళిద్దరి మినిస్టర్ పోస్టుల్ని కూడా పీకేశారు.