ముంబై ఇండియన్స్ ను చిత్తు చేసిన లయన్స్
posted on Oct 15, 2012 9:38AM

ఛాంపియన్స్ లీగ్‌లో లయన్స్ చేతిలో ముంబై ఇండియన్స్ చిత్తుగా ఓడిపోయింది. ముంబై ఇండియన్స్ పై లయన్స్ ఎనిమిది వికెట్లతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన ముంబై ఆరు వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. ముంబయి ఓపెనర్లు స్మిత్, సచిన్ శుభారంభం అందించారు. మాస్టర్ ఆచితూచి ఆడగా, స్మిత్ ఫోర్లతో విజృంభించాడు. దీంతో నాలుగు ఓవర్లలో 35 పరుగులు వచ్చాయి. ఆ మరుసటి ఓవర్లో స్మిత్ అవుటవడంతో ముంబయి జోరు కాస్త తగ్గింది. మిచెల్ జాన్సన్ 29 బంతుల్లో 4 ఫోర్లతో 30, రోహిత్ శర్మ 27 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్‌తో 27, డ్వెన్ స్మిత్ 19 బంతుల్లో 6 ఫోర్లతో 26, దినేశ్ కార్తీక్ 9 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్‌తో 19 నాటౌట్ రాణించారు. సచిన్ 16, పొలార్డ్ 11 పరుగులు చేశారు. చివరి ఓవర్లో బ్యాటింగ్‌కు వచ్చిన అంబటి రాయుడు 4 పరుగులు చేశాడు. టాపార్డర్ రాణించినా భారీ స్కోర్లుగా మలచడంలో విఫలమయ్యారు. 158 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన లయన్స్ మెకంజీ 41 బంతుల్లో 68, డి కాక్ 33 బంతుల్లో 51లు18.5 ఓవర్లలోనే విజయాన్ని అందించారు.