బండి సంజయ్ కు కెటీఆర్ లీగల్  నోటీసులు 

కేంద్ర మంత్రి బండి సంజయ్ పరువు నష్టం నోటీసులు అందుకున్నారు మాజీ మంత్రి కెటీఆర్ ఆయనకు లీగల్ నోటీసులు పంపించారు. తన ప్రతిష్టకు భంగం వాటిల్లే విధంగా బండి సంజయ్ వ్యాఖ్యలు చేసినట్లు కెటీఆర్  ఆరోపించారు  . మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం కేసు వేసిన కెటీఆర్ తాజాగా కేంద్రమంత్రిపై పరువు నష్టం కేసు వేయనున్నట్లు నోటీసులు జారీ చేశారు . ఈ  నోటీసుకు వారం రోజులలోపు సమాధానం ఇవ్వాలని, క్షమాపణ కోరాలని కెటీఆర్ నోటీసులో పేర్కొన్నారు గత పదేళ్లుగా బిజెపితో రాసుకుని, పూసుకుని తిరిగిన బిఆర్ఎస్ కేంద్రమంత్రిపై  నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశమైంది. 
తన చెల్లెలు తీహార్ జైలులో ఉన్నప్పుడు కూడా బిఆర్ఎస్ ఢిల్లీ పెద్దలతో సత్సంబంధాలు కొనసాగించింది.తీహార్ జైలు నుంచి బెయిల్ పై విడుదలయ్యాక ఏకంగా కేంద్రమంత్రిపై పరువు కేసు వేస్తానని నోటీసులు ఇవ్వడం వెనక బిఆర్ఎస్ వ్యూహం ఏమిటి అనేది బోధపడటం లేదు అయితే కెటీఆర్ లీగల్ నోటీసులకు భయపడేది లేదని బండి సంజయ్ వివరణ ఇచ్చారు తాటాకు చప్పుళ్లకు బెదిరేది లేదన్నారు బిఆర్ఎస్ బిజెపిలో విలీనం చేయాలని ఢిల్లీ పెద్దలు కండిషన్ పెట్టారు