కేటీఆర్ కు హైకోర్టులో మళ్లీ చుక్కెదురు!
posted on Jan 8, 2025 2:20PM
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావుకు హైకోర్టులో మళ్లీ చుక్కెదురైంది. ఏసీబీ విచారణకు తన వెంట న్యాయవాదిని అనుమతించాలని కోరుతూ కేటీఆర్ దాఖలు చేసుకున్న లంచ్ మోషన్ పిటిషన్ ను విచారించిన హైకోర్టు అందుకు నో చెప్పింది. అయితే ఏసీబీ కార్యాలయంలో కేటీఆర్ కు దూరంగా ఆయన న్యాయవాదులు ఉండేందుకు అనుమతిస్తామని పేర్కొంది.
ఇందు కోసం ముగ్గురు న్యాయవాదుల పేర్లు ఇవ్వాలని సూచించింది. అంతకు ముందు ఏసీబీ నిబంధనలలో విచారణను న్యాయవాదిని అనుమతించేందుకు నిబంధన ఉందా అని కోర్టు అధికారులను ప్రశ్నించింది. అలాంటి అనుమతి ఏదీ లేదని వారు చెప్పారు. అయితే కేటీఆర్ అంచ్ మోషన్ పిటిషన్ పై తీర్పును హైకోర్టు సాయంత్రానికి వాయిదా వేసింది.