కెటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్ పై విచారణ వాయిదా
posted on Jan 8, 2025 2:12PM
ఫార్ములా ఈ రేస్ కేసులో ఎసిబి విచారణకు కెటీఆర్ న్యాయవ్యాదులను అనుమతించకపోవడంపై బుధవారం హైకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. న్యాయవాదులను అనుమతించకపోవడానికి కారణమేమిటని హైకోర్టు ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది. విచారణ సమయంలో కెటీఆర్ న్యాయవాదులను అనుమతించబోమని ప్రభుత్వ న్యాయవాది వివరణ ఇచ్చుకున్నారు. విచారణ గదికి దూరంగా న్యాయవాదులు కూర్చుంటే పర్వాలేదా అని హైకోర్టు జడ్జి ప్రశ్నించగా అటువంటి అవకాశం లేదని ప్రభుత్వ న్యాయవాది వివరణ ఇచ్చుకున్నారు. కనీసం విచారణ గదిలో దూరంగా కూర్చుని కెటీఆర్ న్యాయవాదులు వినే అవకాశం లేదా హైకోర్టు ప్రశ్నిస్తే ఎసిబి అధికారులను అడిగి చెబుతానని ప్రభుత్వ న్యాయవాది చెప్పడంతో సాయంత్రం నాలుగు గంటలకు హైకోర్టు విచారణను వాయిదా వేసింది. కెటీఆర్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై హైకోర్టు ఇచ్చే తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కెటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. దీంతో కెటీఆర్ సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నట్లు సమాచారంతో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంలో కెవియట్ దాఖలు చేసింది. హైకోర్టులో క్వాష్ పిటిషన్ రిజెక్ట్ కావడంతో కెటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.