ప్రభాస్ కల్కి లో కృష్ణుడు నేనే... ప్రముఖ నటుడి ట్వీట్  

భవిష్యత్తు ఎలా ఉంటుందో కల్కి 2898 ఏడీ (kalki 2898 ad) డైరెక్టర్ నాగ్ అశ్విన్ (nag ashwin)కే కాదు..  కల్కి పుణ్యమా అని  మొత్తం వరల్డ్ వైడ్ సినీ ప్రేమికులకి కూడా  అర్ధం అయ్యింది. ఇంకో అడుగు ముందుకేసి  రాబోయే రోజుల్లో కల్కి ఇండియా వైడ్ గా సరికొత్త రికార్డులు సృష్టించడం పక్కా అని కూడా  అంటున్నారు. ఇంత  భవిష్యత్తుని  చెప్పిన ప్రేక్షకులు ఒక్క విషయంలో మాత్రం ఓడిపోయారు. కల్కి లో  శ్రీకృష్ణుడిగా చేసింది  ఎవరా అనే విషయం వాళ్ళకి అంతు బట్టలేదు.  ఎందుకంటే మేకర్స్ కల్కి లో  కృష్ణుడి ఫేస్ చూపించలేదు.  దీంతో ప్రేక్షకులు సోషల్ మీడియాని ఆశ్రయించారు.కానీ నో ఇన్ఫర్మేషన్. కానీ ఇప్పుడు ఆ కల్కి కృష్ణుడే  బయటకి వచ్చి నేనే కృష్ణుడ్ని అని చెప్తున్నాడు.  

కృష్ణ కుమార్( krishna kumar)తమిళ చిత్ర సీమకి చెందిన కృష్ణ కుమార్ అక్కడ ఎన్నో సినిమాల్లో మంచి మంచి పాత్రలు పోషించాడు.  తాజాగా కల్కి లో కృష్ణుడుగా  చేసింది నేనే అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. దీంతో కల్కి  కృష్ణుడి ఫ్యాన్స్ లో టెన్షన్ తగ్గింది. కృష్ణుడి  క్యారెక్టర్ తనకి రావడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని,  చాలా మంది  సెలబ్రెటీలు తన పాత్రపై  ప్రశంసలు కురిపించారని కూడా చెప్పాడు. ఆ లిస్ట్ ని కూడా  పోస్ట్ చేసాడు.  తెలుగు ప్రేక్షకులకు కూడా కృష్ణ కుమార్  పరిచయమే.  సూర్య(suriya)బ్లాక్ బస్టర్ మూవీ ఆకాశం నీ హద్దురాలో సూర్యకి స్నేహితుడిగా చేసి మెప్పించాడు.  ధనుష్‌  మారన్‌ లోను కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు కల్కి లో  ఫేస్  కనపడే అవసరం రాకపోయినా  తన బాడీ లాంగ్వేజ్‌తో ప్రేక్షకులు   నిజమైన కృష్ణుడే అనుకునేలా చెయ్యడంలో సక్సెస్ అయ్యాడు.

 

ఇక  కేమియో క్యారెక్టర్స్ లో మెరిసిన వాళ్ళకి కూడా ప్రేక్షకుల నుంచి గుడ్ రెస్పాన్స్ వస్తుంది. అర్జునుడి పాత్రలో మెరిసిన  విజయ్ దేవరకొండ తో పాటు దుల్కర్ సల్మాన్, రాజమౌళి, ఆర్జీవీ, ఫరియా, అనుదీప్ కి మంచి పేరు వస్తుంది. ఇటీవల దర్శక ధీరుడు  రాజమౌళి (rajamouli)కల్కి బృందాన్ని మెచ్చుకున్నాడు. అలాగే మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi)కూడా సోషల్ మీడియా వేదికగా స్పెషల్ పోస్ట్ చేసాడు. మైథాలజీని సైన్స్ ఫిక్షన్‌కి ముడిపెడుతూ కల్కి ని అద్భుతంగా మలిచారు. వైజయంతీ మూవీస్‌తో పాటు డైరెక్టర్ నాగ్ అశ్విన్, క్యాస్టింగ్ అందరికీ తన శుభాకాంక్షలు తెలియచేసాడు.