సీఎం జగన్ ఆదేశం.. అధికారిక లాంఛనాలతో కోడెల అంత్యక్రియలు

 

టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో జరగనున్నాయి. మంగళవారం మధ్యాహ్నం ఈ విషయమై సీఎం వైఎస్ జగన్.. సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యంకు ఆదేశాలు జారీ చేశారు. 

కోడెల భౌతికకాయాన్ని హైదరాబాద్‌లోని ఆయన ఇంటి నుంచి స్వగ్రామం గుంటూరు జిల్లా నరసారావుపేటకు తరలిస్తున్నారు. ఈరోజు కోడెల భౌతికకాయాన్ని ఆప్తులు, కార్యకర్తల సందర్శనార్థం స్థానికంగా ఉండే టీడీపీ కార్యాలయంలో ఉంచనున్నారు. రేపు సాయంత్రం కోడెల అంత్యక్రియలు జరగనున్నాయి.