వరల్డ్ స్ట్రొక్ డే 2022 ప్రత్యేకం
posted on Oct 29, 2022 10:53AM
స్ట్రోక్ ను చాలా తీవ్రంగా పరిగణించండి. దీని లక్షణాలు, కారణాలు, రక్షణ పద్దతుల గురించి తెలుసుకుందాం. జీవన శైలి లో మార్పు, ప్రతిరోజూ చేసే పనులలో క్రమపద్దతిలేకపోవడం.. స్ట్రోక్ కు కారణం అవుతాయి. అనుకోకుండా మెదడులో వచ్చే ఈ సమస్య ఎదురైనప్పుడు సరైన సమయంలో చికిత్చ చేస్తే వ్యక్తి పూర్తిస్థాయిలో ఆరోగ్యంగా కోలుకుంటారు. చికిత్చ అందించడం లో ఏమాత్రం ఆలస్యం చేసినా స్ట్రోక్ చాలా తీవ్రంగా ఉంటుంది. మానసిక స్థితి పై తీవ్ర ప్రభావం చూప్తుతుంది. స్ట్రోక్ పై ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ప్రతి ఏటా అక్టోబర్ చివరి వారంలో(అక్టోబర్ 29) ప్రపంచ వ్యాప్తంగా వరల్డ్ స్ట్రోక్ డే నిర్వహిస్తారు.
స్ట్రొక్ ప్రారంభ లక్షణాలు:
*ఒకవైపు కాలు చేయి బలహీన పడడం.
*మాట సరిగా మాట్లాడ లేకపోవడం తడబాటు.
*చూసేటప్పుడు ఆందోళన గా ఉండడం పిచ్చిచూపులు చూస్తున్నట్లు ఉండడం స్పందన లేకపోవడం.
*ముఖంపై బలహీనం గా ఉండడం ముఖం పాలిపోవడం లేదామూతి ఒకపక్కకు వంకర పోవడం గమనించవచ్చు.
*శరీరంలో ఏదైనా ఒకభాగం చచ్చు బదిపోవడం. శరీరం పై పట్టుకోల్పోవడం.
ప్రధాన కారణాలు:
*హై బి పి
*డయాబెటిస్.
*గుండెసమస్యలు.
*పొగతాగడం.
*అత్యధిక కొలస్ట్రాల్
*మధ్యం సేవించడం
స్ట్రొక్ రావడానికి రెండు కారణాలు మెదడులో రక్త ప్రసారం కావాల్సినంత కాకపోవడం. ఇందులో ఆర్టరీలు పగిలిపోవడం మెదడులో ఏ సమయంలో ఐనా రక్తం గడ్డ కట్టుకుపోతుంది. దీనిని మాడర్న్ స్ట్రోక్ అని అంటారు. ఆర్టరీ పగిలిపోవడం వల్ల అధికరక్త స్రావం జరిగి మెదడులో రక్తం ఎక్కడైనా గడ్డ కట్టవచ్చు. మెదదు పనితీరు స్తంబించిపోవడం. దీనిని మేజర్ స్ట్రోక్ గా పేర్కొన్నారు.
మేజర్ స్ట్రోక్ స్థితి పరిష్కారం కోసం సర్జరీ తప్ప మరోమార్గం లేదు. స్ట్రోక్ వచ్చిన అధిక సంఖ్యాకులలో మెడ నరాల వ్యవహారం లో దంమో లెటిక్ తెరఫీ చాలా విజయవంతమైంది. దీనిని సరైన పద్దతిలో చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. రోగికి నాలుగు గంటలలో సపర్యలు చికిత్సలు చేస్తే త్వరగా కోలుకోవచ్చు. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా మనకు మనిషి దక్కే అవాకాశం దాదాపు లేనట్లే. ఒకవేళ ఉన్నా కోమాలో ఎవరిని గుర్తించలేని స్థితికి చేరతారు.