చలికాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే!
posted on Oct 31, 2022 9:30AM
చలికాలంలో మీరోగ నిరోధక శక్తి ని పెంచుకోండి ఇలా...
5 రకాల జాగ్రత్తలు తీసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.అసలే చలికాలం వాతా వరణం లో శీతల గాలులు చల్లటి మంచు కొద్ది రోజుల్లో తాకుతున్నాయి.ఈ సమయం లో మనశరీరంలో రోగనిరోధక శక్తి ని పెంచుకోవడం అత్యవసరం ఎందుకంటే జలుబు దగ్గుతో పాటు అనారోగ్యం నుండి మనల్ని రక్షించుకోవచ్చు.చల్లటి వాతావరణం లో ఇమ్యునిటిని పెంచుకోవాలంటే ఏం చెయ్యాలి.?మన శరీరానికి బలమైన ఇమ్యునిటి పెంచుకోవడం ఎందుకు అవసరం. 5 రకాల పద్దతులు ఏమిటో తెలుసుకుందాం. వీటి సహాయం తో మీ రోగ నిరోధక శక్తిని పెంచి ఆరోగ్యంగా ఉండవచ్చు.చలి జలుబును తెచ్చే వాతావరణం రావడానికి కొద్దిరోజులు మాత్రమే ఉంది. ఈ నేపధ్యం లో అందరి ఇమ్యునిటీ పెంచుకోవడం అవసరం.సాధరనజలుబు,దగ్గుతో పాటు తీవ్రమైన అనారోగ్యం నుండి రక్షించుకోవచ్చు. చల్లటి వాతావరణం లో ఇమ్యునితి పెంచుకోడానికి ఏం చేయాలి? ఇమ్యునిటి ఎలాపెంచుకోవాలి?
1) శరీర వ్యాయామం తప్పనిసరిగా చేయాలి..
మీశరీరం ఆరోగ్యంగా ఉండాలంటే అన్నిటికంటే ఉత్తమమైన పద్ధతి రోజూ వ్యాయామం చేయడం. నియమిత పద్దతిలో వర్క్ అవుట్ లు చేస్తే ఇందులో బ్లడ్ ప్రేషేర్ అదుపులో ఉంటుంది. ఒత్తిడి తగ్గుతుంది.ఎలాంటి ఇన్ఫెక్షన్ మీ శరీరాన్ని చేరితే మీ సిస్టం దీనితో పోరాడేందుకు సిద్ధమౌతుంది రోజూ వ్యాయామం చేస్తే గుండె వ్యాధుల నుండి రక్షణ పొందినట్లే.
2)పోషక ఆహారం...
మీరోగ నిరోధక శక్తిని పెంచేందుకు మంచి ఆరోగ్యవంతమైన ఆహారం అదే డైట్ ప్లాన్ అత్యవసరం. అందులో కొన్ని పోషక తత్వాలు ఉండడంఅవసరం. ప్రోటీన్లు సంపూర్ణంగా ఉండాలి. కార్బో హైడ్రేడ్స్ భోజనం లో తక్కువగా తీసుకోవాలి. ఆరోగ్గ్య వంతమైన ఫ్యాట్స్,ఫలాలు కూరగాయాలు జొన్న,మొక్కజొన్న అత్యవసరం. నిపుణుల అభిప్రాయాల ప్రకారం ఇమ్యునిటి పెంచుకుంటే విటమిన్ బి 6, విటమిన్ సి విటమిన్ ఇ, జింక్, అవసరం రావచ్చు. జింక్,జలుబు దగ్గు, లక్షణాల నుండి ఉపసమనం కలిస్తుంది.
౩) సంపూర్ణ నిద్ర...
రోగనిరోధక శక్తిని పెంచుకోవాలంటే మంచినిద్ర అవసరం. మంచి నిద్ర పోవడం ద్వారా ఇమ్యునిటి రోగనిరోదక శక్తి పెరిగి మీశరీరానికి సిస్టంకు విశ్రాంతి నిస్తుంది .ఈ కారణంగా మీ శరీరానికి రీఫ్ర్సేష్ అయ్యేందుకు నిద్ర సహకరిస్తుంది. మీరు నిద్రకు ఉపక్రమించే ముందు దలేక్టిక్ డివైజ్ లు అంటే మొబైల్,టేప్ లు టి వి లకు దూరంగా
ఉండాలి.
4) నీరు ఎక్కువగా తీసుకోవాలి...
మనశరీరానికి నీరు లేకుండా జీవించి ఉండాలేము. మనశరీరం లో నీరు అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. రోగనిరోధక శక్తి పనితీరు గురించి వచ్చినప్పుడు హైడ్రేషన్ మీశారీరాన్ని తాక కుండా నీరు కాపాడుతుంది. మీశారీరంలో ఇతర అవయవాలు సరిగా పనిచేసేందుకు అనుమతిస్తుంది.
5)ఒత్తిడి తగ్గించే ప్రయత్నం చేయండి...
ఒత్తిడితో మగ్గిపోతున్నారా. దీనిని తగ్గించడం చాలా కష్టమైన పని లో ఒకటి. మీశరీరం ఎప్పుడైతే ఒత్తిడికి గురి అవుతూ ఉంటుందో ఎలాగైనా జీవించి ఉండాలని పద్దతికి చేరుకుంది.ఒత్త్జిది కారణంగా మీశారీరంలో రక్షణ ప్రణాళిక మరింత ఒత్తిడికి గురి అవుతుంది అప్పుడే ఏదైనా సోకినప్పుడు పోరాడడం కష్టమౌతుంది.