నిన్న జగిత్యాల...నేడు నిజామాబాద్.. అన్న కోసమే కవిత యాక్టివ్

ఫార్ములా ఈ రేస్ కుంభకోణంలో మాజీ మంత్రి కెటీఆర్ అరెస్ట్ వార్తల నేపథ్యంలో ఎంఎల్ సి కవిత యాక్టివ్ అయ్యారు. లిక్కర్ స్కాంలో ఇరుక్కున్న కవిత ఆరునెలలపాటు తీహార్ జైలులో ఊచలు లెక్కబెట్టి బయటకు వచ్చారు. బతుకమ్మ పండగకు బ్రాండ్ అంబాసిడర్ గా ముద్ర పడ్డ కవిత జైలు నుంచి విడుదలయ్యాక ప్రజలకు దూరంగా ఉంటున్నారు.  దసరాకు ముందు గైనిక్ సమస్యలతో గచ్చిబౌలిలోని ఓ కార్పోరేట్ ఆస్పత్రికి వచ్చే విజువల్స్ తో ఓ సారి కనపించి మాయమయ్యారు. బతుకమ్మ పండగకు కవిత రాజకీయాల్లో ఎంట్రీ ఇస్తారని వచ్చిన వార్తలు సత్యదూరమయ్యాయి. జైలు నుంచి విడుదయ్యాక  మొదటి సారి జగిత్యాల పర్యటన చేశారు. బిఆర్ఎస్ నుంచి గెలిచిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడంతో కేడర్ అంతా షిప్ట్ అయ్యింది. కవిత జగిత్యాల పర్యటనలో ఈ మార్పు స్పష్టంగా కొట్టొచ్చొంది. ఆ పర్యటన తర్వాత నిజామాబాద్ పర్యటనకు వచ్చారు. జిల్లాకు రావడం ఇదే ప్రథమం. డిచ్ పల్లి వద్ద కవితకు బిఆర్ఎస్ కార్యకర్తలు స్వాగతం పలికారు. సచివాలయ ప్రాంగణంలో ఉన్న తెలంగాణ తల్లి రూపు రేఖలపై విమర్శించిన కవిత బిఆర్ఎస్ రూపొందించిన తెలంగాణ తల్లిని  ఎస్‌ఎఫ్‌ఎస్‌ సర్కిల్‌  వద్ద   పుష్పాంజలి ఘటించారు. 
పార్టీలో హరీష్ రావ్ పై  కళ్లెం వేయడానికి  కవిత రీ ఎంట్రీ ఇచ్చినట్లు తెలుస్తోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు ఒకవేళ ఎసిబి లేదా ఈడీ కెటీఆర్ ను అరెస్ట్ చేస్తే హరీష్ రావ్ లైమ్ లైట్ లోకి వచ్చే అవకాశం ఉంది. మేన బావ అయిన హరీష్ కు చెక్ పెట్టాలంటే కవిత రీ ఎంట్రీ ఇచ్చే అగత్యం ఏర్పడింది. నవ్యాంధ్రలో వైఎస్ జగన్ జైలుపాలయినప్పుడు చెల్లెలు షర్మిల రాష్ట్ర మంతా పర్యటించి బొక్కబోర్లా పడ్డారు  షర్మిల గతే కవితకు పట్టడం ఖాయమని గుసగుసలు వినిపిస్తున్నాయి.  తన  జిల్లా పర్యటనలో ప్రజా సమస్యలపై ఎక్కువ ఫోకస్  పెట్టారు ఈ మాజీ నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు.