కర్ణాటక ఎన్నికల్లో వింతలు.. వెంకన్న మీద ఒట్టు వేయండి..

 

త్వరలో కర్ణాటక ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలు అన్ని పార్టీలకు ముఖ్యం కావడంతో ఎవరి వ్యూహాల్లో వాళ్లు ఉన్నారు. ఎలాగైనా సరే ఈ ఎన్నికల్లో గెలవాలని గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. దీంతో ర్ణాటకలో ఎన్నికల రాజకీయం వేడెక్కింది. అంతేకాదు ఓటర్లను ఆకర్షించేందుకు ఎవరి ప్రయత్నాలు వారు మొదలుపెట్టేశారు అప్పుడే. ఈనేపథ్యంలోనే ఓ ఆసక్తికర అంశం చోటుచేసుకుంది. తమకు ఓటెయ్యాలని వెంకన్న మీద ఓటు వేయించుకుంటున్నారట రాజకీయ నాయకులు. మండ్యా జిల్లాలోని ఓటర్లను ఆకట్టుకునేందుకు రాజకీయ నాయకులు ఉచిత వెంకన్న దర్శనం ఏర్పాటు చేస్తున్నారట. JDS పార్టీ అభ్యర్ధి సీఎస్ పుట్టరాజు మహిళలను తిరుపతి దర్శనానికి తీసుకెళ్లి వారితో వెంకన్నపై ఒట్టు వేయించినట్లు గ్రామ పెద్ద గంగాధర్(78) తెలిపాడు. ఉచిత పుడ్ , టూర్ తో పాటు ఒక్కో మహిళకు 2 వేల రూపాయలు ఇస్తున్నట్లు తెలిపాడు. పాండవపురతోపాటు చిక్కడ, చిన్నకురాలి, రాగిముద్దనెహళ్లి గ్రామాల ప్రజలు కూడా పుట్టరాజు తమకు ఉచిత టెంపుల్ టూర్ ఆఫర్ చేసినట్లు తెలిపారు. ఇప్పటి వరకూ 50 బస్సులు తిరుపతికి వెళ్లి వచ్చాయని తెలిపారు. ఒక్కో బస్సులో 50 మంది ప్రయాణించినట్లు తెలిపారు. తిరుపతి టెంపుల్ కి వెళ్లిన తర్వాత వెంకటేశ్వరస్వామి పై ఒట్టు పెట్టి అందరూ పుట్టరాజుకి ఓటు వేస్తామని చెప్పాలని గ్రామస్తులు తెలిపారు. మొత్తానికి ఎన్నికల్లో గెలవడానికి రకరకాల ప్లానులు వేస్తున్నారు నాయకులు. ఇక ఎన్నికలు ముగిసే లోపు ఇంకెన్ని వింతలు చూడాల్సి వస్తుందో...