వైసీపీ నాయకుల ఆత్మానందం ఏడ్చినట్టే వుంది!

నాశనం అయిపోయే టైమ్ వచ్చినప్పుడు ఎవరికైనా వింతవింత ఆలోచనలు వస్తూ వుంటాయి. ప్రస్తుతం వైసీపీ నాయకుల పరిస్థితి అలాగే వుంది. ఈ ఎన్నికల సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ వైసీపీకి మద్దతు ఇచ్చేశాడని చాలామంది వైసీపీ పిచ్చి పులిహోరలు ఆనందపడిపోతున్నారు. ఇంతకీ ఎన్టీఆర్ ఇచ్చిన మద్దతు ఏంట్రా సామీ అంటే, ఎన్టీఆర్ ఫ్యామిలీతో కలసి ఓటు వేయడానికి వచ్చినప్పుడు బ్లూ షర్ట్ వేసుకుని వచ్చాడంట. వైసీపీ కలరు బ్లూ కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ రాష్ట్ర ప్రజలందరికీ తన మద్దతు వైసీపీకే అని చెప్పడానికి బ్లూ షర్టు వేసుకుని వచ్చాడంట. వీళ్ళది పిచ్చో వెర్రో మీరే చెప్పండి. జూనియర్ ఎన్టీఆర్ బ్లూ షర్ట్ వేసుకొచ్చాడని ఆనందపడిపోవడం, బ్లూ కలర్ డ్రాయర్ వేసుకున్నాడని మురిసిపోవడం.. ఏంట్రా బాబు.. మీ మెంటల్ కండీషన్ మీకు తేడాగా అనిపించట్లేదా? 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu