ముంబైలో హోర్డింగ్ కూలి 8 మంది మృతి

ముంబైలో పలు ప్రాంతాల్లో భారీ గాలులు, వర్షం బీభత్సం సృష్టించాయి. బలమైన గాలుల కారణంగా ఘట్కోపర్ ప్రాంతంలో ఒక భారీ హోర్డింగ్ కుప్పకూలింది. ఆ హోర్డింగ్ పక్కనే వున్న పెట్రోల్ బంక్‌పై పడటంతో ఎనిమిది మంది మరణించారు. వర్షం కారణంగా పెట్రోల్ బంక్‌లో తల దాచుకున్న 60 మందికి పైగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే ఎన్.డి.ఆర్.ఎఫ్., అగ్నిమాపక బృందాలు దుర్ఘటనా స్థలానికి చేరుకుని పలువురిని రక్షించాయి. భారీ గాలులు, వర్షం కారణంగా ముంబైలో జనజీవనం అతలాకుతలం అయింది. ఒక గంటసేపు విమాన సర్వీసులను కూడా నిలిపేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu