టీడీపీ బోర్డ్ మెంబర్ నుండి అనిత తొలగింపు....

 

టీడీపీ ఎమ్మెల్యే అనితను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి (బోర్డు) సభ్యురాలుగా ఇటీవల నియమించిన విషయం తెలిసిందే. అయితే ఈమె నియామకంపై పలు అభ్యంతరాలు వచ్చిన సంగతి కూడా విదితమే. అయితే తాను క్రిస్టియన్ నంటూ అనిత చెప్పిన ఓ ఇంటర్వ్యూ వీడియో బయటకు రావడంతో.. ఆమె క్రైస్తవురాలు అయితే ఆమెను ఎలా నియమిస్తారని పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీంతో  దీనిపై ఓ నివేదిక కావాలని సంబంధిత అధికారులను చంద్రబాబు ఆదేశించారు. అంతేకాదు.. తనను నియమించడంపై కొందరు చేస్తున్న వివాదాల నేపథ్యంలో అనిత కూడా ఆ పదవి నుంచి తనను తప్పించాలని కోరుతూ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. తాను హిందువునే అని, ఎస్సీ కులస్తురాలినని పేర్కొన్న అనిత, తన ఇష్ట దైవానికి సేవ చేసే భాగ్యం కలిగిందని సంతోషపడ్డాను కానీ, కొందరు చేస్తున్న వివాదాల కారణంగా ఆవేదనకు గురయ్యానని ఆ లేఖలో ఆమె వాపోయింది. దీంతో  ఆమెను  ఆ పదవి నుంచి తొలగిస్తున్నట్టు ఏపీ ప్రభుత్వం ఆదేశించింది.