విజయోత్సాహంలో టీడీపీ.. నిరాశ, నిస్పృహల్లో వైసీపీ!
posted on May 13, 2024 9:37PM
ఈరోజు పోలింగ్ సరళిని చూస్తేనే విషయం అర్థమైపోతోంది. టీడీపీ అధికారంలోకి, వైసీపీ అంధకారంలోకి అనే విషయం తెలిసిపోతోంది. దాదాపు 90 శాతం పోలింగ్ జరిగే అవకాశం వుంది. అధికార పార్టీ మీద ప్రజలకు పీకలదాకా కోపం వున్నప్పుడు మాత్రమే ఈ స్థాయిలో ఓటింగ్ జరుగుతుందనే విషయం రాజకీయ పరిశీలకులందరికీ తెలిసిందే. పోలింగ్ ముగిశాక టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం వెల్లివిరుస్తోంది. వైసీపీ వర్గాలు మాత్రం నిరాశ, నిస్పృహల్లో మునిగిపోయి కనిపిస్తున్నారు. పోలింగ్ పూర్తి కాగానే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అద్భుతంగా పోలింగ్ జరిగింది అని ‘ఎక్స్’లో పోస్టు పెట్టారు. వైసీపీ వైపు నుంచి అలాంటి ఉత్సాహభరితమైన ప్రతిస్పందనేదీ కనిపించడం లేదు. కకాకపోతే ఎప్పుడూ కనిపించే ఆ చచ్చుమొహం సజ్జల మీడియా ముందుకు వచ్చి, ప్రభుత్వ సానుకూలత ఓట్ల ఉప్పెనలా మారిందని ఏదోదో సొల్లు ఎక్స్.ప్రెషన్ లేని ముఖంతో చెప్పాడు. సజ్జల మాట్లాడిన తీరు చూస్తుంటే, ఇక వైసీపీ చాప చుట్టేయడం ఫిక్సన్న అభిప్రాయం మరింత బలపడింది.