నగరికి దరిద్రం వదుల్తోంది.. రోజా ఓడిపోవడం ఖాయం!

అబ్బ.. నగరి నియోజకవర్గానికి పట్టిన దరిద్రం వదలబోతోంది. ఆ నియోజకవర్గ వైసీపీ ప్రస్తుత ఎమ్మెల్యే రోజా ఓడిపోబోతోంది. ఎలాగూ వైసీపీ గవర్నమెంట్ పని ఖతమ్ అయిపోయింది. పనిలోపనిగా రోజా ఎమ్మెల్యే పదవి కూడా పోయినట్టే, ఎందుకంటే తాను నగరి నియోజకవర్గం నుంచి గెలిచే ఛాన్స్ లేదని రోజా చెప్పకనే చెప్పారు మరి. ఇప్పటి వరకు రెండుసార్లు నగరి నుంచి గెలిచిన రోజా బిహేవియర్ చూసి ప్రజలు ఎలాగూ ఓడించాలని ఫిక్సయ్యారు. దీనికితోడు నగరిలో తనను ఓడించడానికి తన పార్టీకి చెందిన నాయకులే కుట్ర పన్నుతున్నారని రోజా లబోదిబో అంటోంది. ఒకపక్క శుభమా అని పోలింగ్ జరుగుతుంటే, మరోపక్క రోజా తన పార్టీ నేతల మీదే విరుచుకుపడ్డారు. నగరిలో తనను ఓడించాలని తన పార్టీలోని నాయకులే కొందరు  ప్రయత్నిస్తున్నారని రోజా చెప్పారు. ఇంతకాలం పార్టీలో తనకు ప్రత్యర్థులుగా ఉన్న వారంతా ఇప్పుడు ఎన్నికల సమయంలో తన ఓటమికి ప్రచారం చేస్తున్నారని ఆమె ఆరోపించారు.  వైసీపీ నాయకుడు కేజే కుమార్ వంటి వారు తన ఓటమికి ప్రయత్నిస్తున్నారని రోజా ఆరోపించారు. టీడీపీ వాళ్ళ కంటే  తనపార్టీ వాళ్ళే తన ఓటమికి ఎక్కువగా కష్టపడుతున్నారన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu