కేజ్రీవాల్ కు షాక్.. మిశ్రా ఆరోపణలపై ఏసీబీ సోదాలు

 

ఆప్ బహిష్కృత నేత కపిల్‌ మిశ్రా ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పై అవినీతి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటిదాకా ఆయనమీద పలు ఆరోపణలే గుప్పించారు. అయితే ఇప్పుడు మిశ్రా ఆరోపణలకు బాగానే ఫలితం దక్కినట్టు కనిపిస్తోంది. ఎందుకంటే.. కపిల్‌ మిశ్రా చేసిన ఆరోపణలపై నిజానిజాలు తెలుసుకునేందుకు అవినీతి నిరోధక శాఖ రంగంలోకి దిగింది. ఆరోగ్యశాఖ కొనుగోలు చేసిన ఔషధాలకు సంబంధించి రూ. 300 కోట్ల కుంభకోణం జరిగిందని మిశ్రా ఆరోపించిన నేపథ్యంలో దిల్లీలోని పలు చోట్ల సోదాలు చేపట్టింది. ఫార్మా కంపెనీలు మందులు భద్రపరిచే మూడు గోదాముల్లో తనిఖీలు చేపట్టింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu