పాక్ కుట్ర... జాదవ్ కు బదులు హబీబ్
posted on Jun 1, 2017 11:43AM

భారత నావికాదళ మాజీ అధికారి కులభూషణ్ జాదవ్ పాక్ కు ఉరిశిక్ష విధించిన సంగిత తెలిసిందే. దీనిపై భారత్ అంతర్జాతీయ కోర్టును ఆశ్రయించగా అక్కడ పాక్ కు ఎదురుదెబ్బ తగిలింది. పాక్ ఇచ్చిన తీర్పుపై స్టే ఇస్తూ.. తమ ఆదేశాలు వచ్చేంత వరకూ ఎలాంటి చర్యలు తీసుకోవడానికి వీల్లేదని ఆదేశించింది. అయితే ఇప్పుడు జాదవ్ కేసు మరో మలుపు తిరిగింది. పాక్ మరోసారి తన కపట బుద్దిని బయటపెట్టింది. నేపాల్ లో అదృశ్యమైన తమ సైన్యాధికారి లెఫ్టినెంట్ కల్నల్ మొహమ్మద్ హబీబ్ జాహిర్ భారత అధీనంలో ఉన్నారని, అతని గురించిన సమాచారం చెప్పాలని లేక రాసింది. జాదవ్ ను విడుదల చేయించుకోవాలన్న ఉద్దేశంతోనే హబీబ్ ను ఇండియా అరెస్ట్ చేసిందని.. ఆయన్ను విడుదల చేయాలని డిమాండ్ చేసింది. మరోవైపు భారత్ మాత్రం హబీబ్ గురించిన సమాచారం తమకు తెలియదని ఆరోపిస్తుంది. కాగా, గతంలో ఐఎస్ఐతో కలసి పనిచేసిన హబీబ్, నేపాల్ లోని లుంబినీకి వచ్చి ఖాట్మండు ప్రాంతంలో అదృశ్యమయ్యాడు.