'కల్కి 2898 AD' ఓటీటీ అప్డేట్.. అసలు జనాలు చూస్తారా..?

ప్రస్తుతం ఎక్కడ చూసినా 'కల్కి 2898 AD' (Kalki 2898 AD) మేనియానే కనిపిస్తోంది. ఆన్ లైన్, ఆఫ్ లైన్ తేడా లేకుండా ప్రతి చోటా కల్కి గురించే చర్చ. చాలా రోజుల తర్వాత 'కల్కి' (Kalki) రూపంలో అతి పెద్ద సినిమా పండుగ వచ్చింది. దీంతో సినీ అభిమానులంతా థియేటర్లకు క్యూ కడుతున్నారు. దానికి తోడు మొదటి షో నుంచే ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వస్తోంది. దీంతో 'కల్కి' చిత్రం బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే ఇక ఈ సినిమాకి సంబంధించి ఓటీటీ వివరాలు వెల్లడయ్యాయి.

'కల్కి 2898 AD' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. సినిమా ప్రారంభంలో ఈ విషయాన్ని అఫీషియల్ గా రివీల్ చేశారు. సౌత్ భాషల ఓటీటీ రైట్స్ ని అమెజాన్ సొంతం చేసుకోగా, హిందీ వెర్షన్ మాత్రం నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుందని తెలుస్తోంది. థియేటర్లలో విడుదలైన ఎనిమిది వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా అగ్రిమెంట్ జరిగినట్లు సమాచారం. అంటే, ఆగస్టు 22 తర్వాతే 'కల్కి' ఓటీటీలోకి వచ్చే అవకాశముంది. 

అయితే ఎప్పుడొచ్చినా ఈ సినిమాని ఓటీటీలో చూడటానికి ఆడియన్స్ పెద్దగా ఆసక్తి చూపించకపోవచ్చు. ఎందుకంటే ప్రచార చిత్రాలతోనే 'కల్కి' అనేది బిగ్ స్క్రీన్ మీద ఎక్స్ పీరియన్స్ చేయాల్సిన సినిమా అని అందరికీ అర్థమైపోయింది. ఇక ఇప్పుడు రిలీజ్ తర్వాత.. థియేటర్లలో మొదటి షో చూసిన ఆడియన్స్ నుంచి వస్తున్న రియాక్షన్ చూసి.. ఖచ్చితంగా బిగ్ స్క్రీన్ మీద చూడాలని అందరూ ఫిక్స్ అవుతున్నారు. ఇదొక విజువల్ వండర్ అని, ఇలాంటి సినిమాలకు బిగ్ స్క్రీన్ మీద చూసి అనుభూతి చెందాలని.. థియేటర్లలో సినిమా చూసిన ప్రతి ఒక్కరూ అభిప్రాయపడుతున్నారు. ఆడియన్స్ నుంచి వస్తున్న ఈ రెస్పాన్స్ చూస్తుంటే.. 'కల్కి' చిత్రాన్ని థియేటర్లలో చూడకుండా, ఓటీటీలో చూడొచ్చులే అని వెయిట్ చేసేవారు పెద్దగా ఉండకపోవచ్చు అనిపిస్తోంది.