కల్కి 2898 AD.. అదొక్కటే మైనస్...

సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూసిన 'కల్కి 2898 AD' (Kalki 2898 AD) సినిమా భారీ అంచనాల నడుమ థియేటర్లలో అడుగు పెట్టింది. మొదటి షో నుంచే ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వస్తోంది. విజువల్ వండర్ లా ఉందని, ఇండియన్ సినిమా చరిత్రలో ఇలాంటి సినిమా రాలేదని అంటున్నారు. అసలు ఇలాంటి చిత్రం చేయాలని ఆలోచించిన దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin)పై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. 'కల్కి'తో నాగ్ అశ్విన్ ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లాడని, స్టోరీ లైన్ కొత్తగా ఉందని, విజువల్స్ హాలీవుడ్ సినిమాలని తలదన్నేలా ఉన్నాయని అంటున్నారు. అదే సమయంలో ఈ సినిమాకి ఒకే ఒక్కటి మైనస్ అయిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

దర్శకుడిగా నాగ్ అశ్విన్ కి 'కల్కి' మూడవ సినిమా. ఆయన దర్శకత్వంలో వచ్చిన మొదటి రెండు సినిమాలు 'ఎవడే సుబ్రహ్మణ్యం', 'మహానటి' ప్రేక్షకుల మెప్పు పొందడంతో పాటు.. విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. ఆ రెండు చిత్రాల్లో దర్శకుడు నాగ్ అశ్విన్ పండించిన ఎమోషన్స్ కి అందరూ ఫిదా అయ్యారు. అవే ఆ సినిమాలను నిలబెట్టాయి. అయితే 'కల్కి' విషయంలో మాత్రం ఆ ఎమోషన్సే మైనస్ అయ్యాయని చెబుతున్నారు. విజవల్ గా అద్భుతంగా ఉన్నప్పటికీ.. నాగ్ అశ్విన్ మార్క్ బలమైన ఎమోషన్స్ కూడా తోడనట్లయితే ఇకసలు 'కల్కి' సినిమా విషయంలో వంక పెట్టడానికే ఏమీ ఉండేది కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.