ప్రభాస్  కల్కి థియేటర్స్ లో ఇన్ కంటాక్స్ రైడింగ్ జరుగుతాయేమో!  

ఇందు మూలంగా యావత్ మంది ప్రజానీకానికి తెలియచేసేది ఏమనగా ప్రభాస్ (prabhas)కల్కి (kalki 2898 ad)టికెట్ల కోసం ఇప్పటినుంచే తొందర పడండి. ఎందుకంటే ఆల్ షోస్ హౌస్ ఫుల్ తో  టికెట్స్ దొరకని పరిస్థితి. ఒక్క ఇండియాలోనే కాకుండా  ఓవర్ సీస్ లో కూడా సేమ్ క్లైమెట్. ఇందుకు నిదర్శనమే నార్త్ అమెరికా కలెక్షన్స్.

కల్కి నార్త్ అమెరికాలో మొదటి రోజు 3 .8 మిలియన్ డాలర్ల గ్రాస్ ని సాధించింది. మన ఇండియన్  కరెన్సీ లో చెప్పాలంటే 30 కోట్లపై మాటే. ఇక రెండవ రోజు కూడా తన  హవాని ఏ మాత్రం తగ్గించలేదు. ఏకంగా 7 మిలియన్ డాలర్ల గ్రాస్ ని సాధించింది. అంటే మన ఇండియన్ కరెన్సీలో 58 కోట్ల రూపాయలు. దీంతో సినీ  ట్రేడ్ వర్గాల వారు ఆశ్చర్యపోతున్నారు. ప్రభాస్ క్రేజ్ రోజురోజుకి పెరుగుతుందనటానికి ఇదొక నిదర్శనం అని అంటున్నారు. అదే విధంగా నార్త్ అమెరికా లో ఫస్ట్ డే  హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన  మొదటి  ఇండియన్ సినిమాగా కల్కి చరిత్ర సృష్టించింది. ఇప్పుడు సెకండ్ డే తో కూడా తన చరిత్రని తానే తిరగరాసింది. రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులు పక్కా అంటున్నారు. దీంతో కల్కి థియేటర్స్ లో ఐటి రైడింగ్  జరుగుతుందేమో అంటూ కొంత మంది  కామెంట్స్ చేస్తున్నారు. 

 

ఇండియా వైడ్ గా కూడా అత్యధిక కలెక్షన్ ని సాధిస్తూ పలు రికార్డులకు చేరువలో ఉంది. ప్రభాస్ పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ కి అమితాబ్, కమల్ హాసన్, దీపికా పదుకునే తోడవ్వడంతో కల్కి ని నిండుతనం వచ్చింది. దర్శకుడు నాగ్ అశ్విన్ టేకింగ్ కి విజువల్స్ కి అందరు ఫిదా అవుతున్నారు. వైజయంతి మూవీస్ పై సీనియర్ నిర్మాత అశ్వని దత్ తన ఇద్దరు కూతుళ్లతో కలిసి  600 కోట్ల బడ్జట్ తో నిర్మించాడు