ఆ విగ్రహం కదిలించటమే... జయను కబళించిందా? 

 

జయలలిత మరణం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఒకవైపు ఆమెపై విష ప్రయోగం లాంటివి జరిగాయేమో అంటున్నారు కొందరు. శశికళే కారణమనే వారు మరికొందరు. నేరుగా ప్రధానికే లేఖలు రాసి మరీ జయ మృతి వెనుక రహస్యాలు బయట పెట్టాలని కూడా కోరుతున్నారు. ఇలాంటి అనుమానాస్పద స్థితిలో మరో ప్రచారం కూడా తాజాగా మొదలైంది. అయితే ఇందులో నేరుగా దేవాధిదేవుడు శివుడ్నే ఇన్వాల్వ్ చేస్తున్నారు. అమ్మ అభిమానులు కూడా ఆమె మరణానికి కారణం మహేశ్వరుడే అనుకుంటున్నారు!


జయ గుండెపోటుతో చనిపోయింది కదా... మధ్యలో ఈ పరమ శివుడి యాంగిల్ ఏంటి అంటారా? ఆ విషయం తెలియాలంటే మనం కంచికి వెళ్లాలి. అక్కడ ఏకాంబరనాథర్ మందిరం వుంటుంది. గర్భ గుడిలో ప్రధాన మూర్తి మట్టితో చేయబడి వుంటుంది. అందుకే, శివుడి పంచభూత లింగ క్షేత్రాల్లో దీన్ని పృథ్వీ క్షేత్రం అంటారు. లింగాన్ని పృథ్వీ లింగం అంటారు. కాని, ఈ మధ్య కంచిలోని ఏకాంబరనాథర్ ఆలయ మూల మూర్తికి కొంత నష్టం జరిగింది. అలా భిన్నమైన విగ్రహం వుండకూడదంటూ ఆలయ నిర్వాహకులు మార్చేశారు. కాని, చరిత్రకందని కాలం నాటి ఆ విగ్రహం పూర్తిగా తీసేయటం తప్పని పండితులు అంటున్నారట. వేల ఏళ్ల నాటి ఆ విగ్రహానికి మరమ్మత్తులు చేసి పునః ప్రతిష్ఠించాల్సిందని చెబుతున్నారు. కాని, డిసెంబర్ 5వ తేదీనే కొత్త విగ్రహ ప్రతిష్ఠ జరిగిపోయింది... 


కొత్తగా విగ్రహం ప్రతిష్ఠించటం, అదే రోజున జయ అమాంతం మరణించటం ఇప్పుడు తమిళనాడులో అందర్నీ అనుమానాలకి గురి చేస్తోంది. ఏ కాలం నాటితో అయిన విగ్రహాన్ని తీసేయాల్సింది కాదంటున్నారు అభిమానులు. ఇందులో నిజానిజాలు ఎంతోగాని ఇప్పుడు చేయగలిగింది కూడా ఏం లేదు...  


 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu