జయలలిత గురించి రజినీ అప్పుడెందుకలా మాట్లాడాడు?

 

జయలలిత, రజినీకాంత్ కలిసి నటించలేదు. సినిమా రంగంలో ఇద్దరిదీ వేరు వేరు శకం. రజినీ ఎదుగుతుండగానే జయలలిత రాజకీయాల్లోకి వచ్చేసింది. ఆమె తమిళనాడు సీఎంగా చెన్నైని ఏలుతుంటే... రజినీకాంత్ క్రమంగా తలైవా అయిపోతూ టీనగర్ ని పరిపాలించాడు. అయితే, ఆమె మృతి తరువాత రజినీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జయని రాజకీయాల్లో నేరుగా ఏనాడూ ఢీకొట్టని సూపర్ స్టార్ ఆమె ఓటమికి మాత్రమే తానే కారణమన్నాడు! 


1996లో జయలలిత తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయారు. ఆమె పార్టీ అన్నాడీఎంకేకు అతి తక్కువ సీట్లు వచ్చాయి. కరుణానిధి సారథ్యంలోని డీఎంకేకి అధికారం లభించింది. దీనికి కారణం, జయ గెలిస్తే తమిళనాడుని ఆ దేవుడు కూడా కాపాడలేడని... రజినీ చేసిన వ్యాఖ్యలే అంటారు చాలా మంది! ఇంత వరకూ రజినీకాంత్ ఎప్పుడూ ఆ సంగతి ప్రస్తావించలేదు. ఆయన స్టేట్మెంట్ చేసిన మాట వాస్తవమే అయినా జయ తన కామెంట్ వల్లే ఓడిపోయిందని మాత్రం ఏనాడూ అన్నలేదు. కాని, జయలలిత సంతాభ సభలో రజినీకాంత్ ఆ విషయం గుర్తు చేసుకున్నారు. 


1996లో జయలలిత పార్టీ ఓటమికి తాను కారణమైనప్పటికీ తరువాత ఆమె మహానేతగా ఎదిగారని రజినీ కీర్తించారు. జనం అభిమానం సంపాదించుకుని అమ్మగా అవతరించారని అన్నారు. మొత్తానికి ఎప్పుడూ డిస్కస్ తన  1996నాటి కామెంట్ గురించి మాట్లాడి రజినీ కొత్త థియరీలకి ఛాన్స్ ఇచ్చారు! ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇంత కాలం జనం భావించినంత అసాధ్యమేం కాకపోవచ్చు!  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu