ఇక్కడ వైఎస్.. అక్కడ జయ.. అప్పుడు కర్నూల్.. ఇప్పుడు చెన్నై! 


చెన్నై చిగురుటాకులా వణికిపోతోంది. కారణం తుఫాన్! వార్ధ భూతం తమిళనాడు రాజధానిని వరదలై ముంచేస్తోంది. అయితే, కేవలం కొన్ని రోజుల క్రితమే తమిళనాడులో ఏ విషాదం చోటు చేసుకుందో మనకు తెలుసుగా? అమ్మ అంతిమ యాత్ర మెరీనా బీచ్ వరకూ కొనసాగింది! ఇప్పుడు అదే బీచ్ అల్లకల్లోలంగా మారిపోయింది! తుఫాన్ తో అలలు ఎగిసిపడుతూ జయ కోసం ఆరాటపడుతున్నట్టు వున్నాయి! కాని, అవే అలలు అనేక అనుమానాలకి దారి తీస్తున్నాయి కూడా... 


జయ మరణానికి, వార్ధ తుఫాన్ కి సంబంధం ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. కాని, సోషల్ మీడియాతో సహా చాలా మంది చాలా చోట్లా మాట్లాడుకుంటున్న ఆసక్తికర విషయం ఒకటి వుంది. అదేంటంటే, గతంలో మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ దురదృష్ఠకర రీతిలో మరణించారు. సెప్టెంబర్ 2న ఆయన చనిపోయాక నెల తిరక్కుండానే కుంభవృష్ఠి కురిపింది తెలుగు నేలపై. దాని కారణంగా కర్నూల్ మొత్తం నీట మునిగింది. పెద్ద పెద్ద ప్రాజెక్ట్ లు కూడా కట్టలు తెంచుకుని ఊళ్లని ముంచేస్తాయేమో అని అంతా భయపడాల్సి వచ్చింది!


వైఎస్ తరువాత ఇప్పుడు జయలలిత కూడా పదవిలో వుండగానే మరణించింది. ఆమె మృతి కూడా అందర్నీ షాక్ కి గురి చేసింది. కాకపోతే, విభ్రాంతికరంగా వైఎస్ చనిపోయాక వచ్చినట్టే ఇప్పుడు వరదలు చెన్నైని ముంచెత్తుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రుల హఠాన్మరణం, తరువాత ఇలా వరదలు రావటం యాదృచ్ఛికమేనా? అంతేనంటున్నారు చాలా మంది. కాని, దీనికి ఏదో అలౌకిక కారణం తప్పకుండా వుండి తీరుతుందంటున్నారు మరి కొంత మంది. ఇక అమ్మ అభిమానులైతే తమలాగే ప్రకృతి కూడా విలపిస్తుందంటున్నారు!


వైఎస్ మృతి, తరువాత వరదలు, జయలలిత మృతి, ఇప్పుడు వెంటనే భీకర తుఫాను... ఇదంతా కష్టా కాలం. తెలుగు ప్రజల్లాగే తమిళులు కూడా ఈ కష్టాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలని కోరుకుందాం. అలాగే, వార్ధ అతి తక్కువ నష్టంతో తీరం దాటిపోవాలని ఆశిద్దాం... 


 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu