నన్ను నేను నిగ్రహించుకొంటున్నాను: పవన్ కళ్యాణ్
posted on Aug 10, 2015 10:45AM
.jpeg)
కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా కోరుతూ తిరుపతిలో మొన్న నిర్వహించిన బహిరంగ సభలో ఆత్మహత్యా ప్రయత్నం చేసిన ముని కామకోటి అనే యువకుడు నిన్న చెన్నైలో ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించడంపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పందిస్తూ ట్వీట్ మెసేజ్ పెట్టారు. “మునికోటి చనిపొవటం నాకు చాల బాధ కలిగించింది. వారి కుటంబసభ్యులకు నా ప్రగాడ సానుభూతిని తెలియ చేస్తున్నాను.” ఆ తరువాత మరొక మెసేజ్ లో “అతని మరణానికి కారణమయిన ఈ ప్రత్యేక హోదా అంశం గురించి ఈ పరిస్థితుల్లో మాట్లాడకుండా నున్ను నేను నిగ్రహించుకొంటున్నాను,” అని వ్రాసారు.
రాష్ట్రంలో ప్రత్యేక హోదా కోసం పోరాటాలు మళ్ళీ ఊపందుకొంటున్న ఈ సమయంలో ఆయన తను తను నిగ్రహించుకోవలసిన అవసరం ఏమిటో తెలియదు. మళ్ళీ ఎంపీలు దీనిపై దృష్టి సారించకుండా వ్యాపారాలు చేసుకొంటున్నారని విమర్శించడం ఎందుకో తెలియదు. ఆయన మునికోటి మృతికి సంతాపం తెలిపిన తరువాత ప్రత్యేక హోదా గురించి ఇటువంటి మాటలు చెప్పే బదులు, దాని కోసం ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దు అని చెప్పి ఉండి ఉంటే ఉపయోగం ఉండేది.